విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
బ్రహ్మాండమైన వేగంతో గంగా సింధు బ్రహ్మపుత్రాది నదులన్నీ వర్షాకాలంలో ఎంతో ఉరవడిగా వచ్చి సముద్ర మేవాభిముఖా ద్రవంతి. మహాసాగరాని కభిముఖంగా ప్రవహిస్తూ అందులోనే చివరకు వచ్చి ఎలా పడిపోతాయో అలాగే నీ విశ్వరూపమనే మహాసాగరంలో వచ్చి చేరి పోతున్నారాయా యోధ వీరులంతా నంటాడు. వక్తా ణ్యభి విజ్వలంతి సెగలు పొగలు కక్కుతున్నా యాయన ముఖాలు. అందులో పడి మాడిపోతున్నా రెక్కడి వారక్కడ.
నదులతో పోల్చి వర్ణించటంలో ఒక అంతరార్థ మున్నది. బాహ్యమైన ప్రేరణ ఏదీ అక్కర లేదు నదులకు. ఎక్కడో కొండల్లో కోనల్లో బయలు దేరి వాటి పాటికవే ప్రవహిస్తూ వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. వాటికొక గమ్యమంటూ ఉన్నది. అది సాగరం. దానికభి ముఖంగానే ప్రవహిస్తూ పోతాయవి. అందులో కలిసే వరకూ ఆగవు. ఎవరో మెడబట్టి తోస్తే వచ్చిపడ్డట్టు ఎవరూ తోయ కుండానే వచ్చి పడతాయందులో. పడితే గాని వాటి ప్రయాణమాగదు. అలాగే ఇక్కడ పాండవులేమిటి కౌరవులేమిటి యాదవులేమిటి. ఎవరూ చెప్పకుండానే అప్రయత్నంగా తమ పాటికి తామే వెతుక్కుంటూ పోయి పడుతున్నా రాయన విశాల భీకర వక్త్ర సాగరంలో నదులలాగా.
ఇదంతా వ్యాసభగవానుడు వర్ణిస్తుంటే నిద్రలో నడచిపోయే వారిని మనసులో పెట్టుకొని వర్ణిస్తున్నాడా అనిపిస్తుంది. మంచి నిద్రలో లేచి
Page 418