#


Index

విశ్వరూప సందర్శన యోగము

చూస్తున్నాను. కేచి ద్విలగ్నా దశనాంతరేషు. కొందరైతే నీ క్రూరమైన కోరలలో చిక్కి - చూర్ణి తై రుత్త మాంగైః తలకాయలు తాటి కాయలలాగా పగిలి చూర్ణమై పోవటం కూడా చూడ గలుగుతున్నాను. ఇక నాకు వారివల్ల ఎలాటి భయమూ ముంచుకు రాదనే ధైర్యమూ ఉంది నీకు. అలాగే ఈ నీ ఉగ్రమైన రూపాన్ని ఇలాగే చూస్తూ పోతే అధైర్యమూ చోటు చేసుకొంటున్నది.

యధా నదీనాం బహవో 2ంబు వేగాః
సముద్ర మే వాభిముఖా ద్రవంతి
తధా తవామీ నరలోక వీరా
విశంతి వక్తాణ్యభి విజ్వలంతి - 28

యధా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశంతి నాశాయ సమృద్ధవేగాః
తధైవ నాశాయ విశంతి లోకాః
త వాపి వక్రాణి సమృద్ధ వేగాః - 29

లేలి హ్యసే గ్రసమాన స్సమంతా
ల్లోకాన్ సమగ్రాన్ వదనై ర్జ్వలద్భిః
తేజోభి రాపూర్య జగత్స మగ్రం
భాస స్తవోగ్రాః ప్రతపంతి విష్ణో - 30


  ఇంకా వర్ణిస్తున్నా డర్జునుడా విశ్వరూపాన్నీ. దాని వదన గహ్వరంలో ప్రవేశించే యోధవీరులనూ. యధా నదీనాం బహ వోంబువేగాః

Page 417

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు