#


Index

విశ్వరూప సందర్శన యోగము

అమీచ త్వాం ధృత రాష్ట్ర స్యపుత్రాః
సర్వే సహై వావని పాలసంఘైః
భీష్మద్రోణః సూత పుత్తస్తవాస్యే
సహా స్మదీయై రపి యోధము ఖ్యైః - 26

వక్తాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాళాని భయాన కాని
కేచిద్విలగ్నాదశనాంత రేషు
సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగైః - 27


  అంతే కాదు. ఒక పక్క ఎక్కడ లేని భయం గొలుపుతున్నా మరొక పక్కధైర్యం కూడా ఇస్తున్నావు నీ వాలకం చూస్తే. రేపు సంగ్రామ రంగంలో కౌరవ వీరుల నెలా జయించగలనా అని కొంచెం సంకోచ ముండేది నాకింతకు ముందు. ఇప్పుడలాటి ఆశంక నిన్ను చూస్తే తొలగిపోయింది కూడా. ఎలాగంటే అమీ చ త్వాం ధృత రాష్ట్ర స్య పుత్రాః ఇరుగో ధృతరాష్ట్రుని సంతానమైన దుర్యోధనాదులేమి. వారేగాక వారితరఫున పోరాడటానికి వచ్చిన అవని పాలసంఘైః ఆయా దేశాల నేలే రాజన్యులేమి. ఇంకా దేవుడు మేలు చేస్తే వారందరికీ తలమానికాలైన భీష్మ ద్రోణ కర్ణాదులేమి. వారందరూ సహాస్మదీయైః మా సైన్యంలో ఉన్న యోధ వీరులతో సహా. వక్రాణి తే బ్రహ్మాండంగా తెరచిన నీ భయంకర వక్త్ర గహ్వరంలో త్వరమాణా విశంతి. అహ మహమికతో వచ్చి అతి శీఘ్రంగా వారి పాటికి వారే ప్రవేశించటం నాకు కనపడుతున్నది. దంష్ట్రా కరాళమూ భయానకమూ అయిన ఆ ముఖ రంధ్రాలలో వారు రావటం ప్రవేశించటం ప్రత్యక్షంగా

Page 416

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు