Index
విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత 
దంష్ట్రా కరాళాని చ తే ముఖాని
దృష్టివ కాలానల సన్ని భాని
దిశో నజానే న లభేచ శర్మ
ప్రసీద దేవేశ జగన్ని వాస - 25
చూస్తున్న కొద్దీ బెంబేలు పడి ఏదీ పాలు పోక ఇక కాళ్ల బేరానికి వచ్చాడర్జునుడు. అంతవరకూ పండ్ల భీకరాని కెలాగో నిలదొక్కుకొని ఇక చేతగాక మొరపెడుతున్నాడు. అయ్యా దంష్టా కరాళాని చతే ముఖాని. నృసింహ కరాళంలాగా ఏమిటా దంష్ట్రలు ఏమిటా వికృతమైన ముఖాలు. కాలానల సన్నిభాని. ప్రళయ కాలాగ్ని జ్వాలలు క్రక్కుతున్నాయి. నీవైపు తేరి చూడటానికే భయంగా ఉంది. దిశోన జానే నల భేచ శర్మ. నీవింకా అలాగే చూపుతూ కూచున్నావంటే నేను తట్టుకోలేను. దిక్కు తోచటం లేదు. మనః స్తిమితం తప్పుతున్నది. ప్రసీద దేవేశ. దయ ఉంచి నీ ప్రసన్నమైన రూపం చూపు స్వామీ. జగ న్ని వాస చరా చర జగత్తు కంతటికీ నివాసం నీవే. అంతేగాక నీవే మరలా ఈ జగత్తులో సర్వత్రా నివసిస్తున్నావని పేరు. నీవు తప్ప మరేదీ లేదప్పటికి. అలాంటప్పుడీ జగత్తులోనే బ్రతుకున్న మేము కూడా నీవే గదా. ఎందుకు మాకింత భయంకరంగా కనిపిస్తూ మమ్మింతగా హడల గొడుతున్నావు.
Page 415
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు