విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
స్వప్రయత్నంతో సాధించిన దైతేనే నిర్భయంగా చూడగలడు. ఏదో గాదది. శ్రవణ మననధ్యానాదుల వల్ల ఉదయించిన బ్రహ్మాకార వృత్తి. అలాటి స్వార్జితమైన సమ్యగ్దర్శనమే సమగ్రంగా ఆకళించుకోగలదు బ్రహ్మతత్త్వాన్ని. అసంశయం సమగ్రం అని గదా గీత ఇంతకు ముందు బోధించిన సత్యం. సమగ్రమంటే అర్థం. విశ్వేశ్వరుడూ విశ్వరూపమూ రెండూ ఏకంగా భావించి అది ఏదో గాదు నా స్వరూపమేనని అనుభవానికి తెచ్చుకోటమే సమగ్రం. అలా కాక స్వరూపాన్ని మరచి కేవలం దాని ప్రదర్శన మాత్రమే దర్శించటం సమగ్రం కాదు. అది సంసారం. అది ఎప్పుడూ భయంకరమే మనకు. అందుకే ప్రస్తుత మడుగడుగనా భయాందోళనలు చెందుతున్నా డర్జునుడు.
అలాటి భీతితోనే ఆక్రందనం చేస్తూ వాపోతున్నాడు. ఏమని. నభః స్పృశం దీప్తమనేక వర్ణం - వ్యాత్తాననం - దీప్త విశాల నేత్రం. ఆకాశమంటే నీ శరీరమూ - చిత్ర విచిత్రమైన నీ శరీర చ్ఛాయ - దశ దిశల వరకూ వ్యాపించేలాగా తెరచిన నీ నోరూ పెద్దవిగా చేసి చూచే నీ మిడిగుడ్లూ - నీ నిడుపాటి కోరలూ - చూస్తే ఎవరికి భయ మేర్పడదు. దేవతలకే ఏర్పడుతుంటే ఇక నా బోటి వాడి పరిస్థితి అడగాలా. చూచే కొద్దీ ధృతింన విందామి - నాకు ధైర్యం చాలటం లేదు. శమంచ మనసు నిలవటం లేదు. కారణం. విష్ణో నిజంగా నీవు విష్ణువువే. సర్వవ్యాపకమైన తత్త్వాని వని అర్థం. కృష్ణుడిప్పుడు విష్ణువయి కనపడుతున్నా డర్జునుడికి. అంటే వ్యక్తమైన రూప మవ్యక్తమయి గోచరిస్తున్నది.
Page 414