#


Index

విశ్వరూప సందర్శన యోగము

రూపం మహత్తే బహు వక్త్ర నేత్రం
మహాబాహో బహు బాహూరు పాదం
బహూదరం బహు దంష్ట్రా కరాళం
దృష్ట్వా లోకాః ప్రవ్యధితా స్తథాహమ్ - 23

నభః స్పృశం దీప్త మనేక వర్ణం
వ్యాత్తా ననం దీప్త విశాల నేత్రం
దృష్ట్వాహిత్వాం ప్రవ్యధితాంతరాత్మా
ధృతింన విందామి శమంచ విష్ణో - 24



  రూపం మహత్తే. ఎంత గొప్ప భయంకరమైన రూపమంటే అది. ఎన్నో నోళ్లూ ఎన్నో కళ్లూ ఎన్నో చేతులూ కాళ్లూ - ఎన్నో కడుపులూ ఎన్నో వికృతమైన దంష్ట్రలూ. ఇలాటి భీకరమైన ఆకృతిని చూస్తే ఎవరికి భయం వేయదు. అందుకే లోకులంతా హడలిపోతున్నారు. తధాహం వారే గాదు. నాకూ హడలుగానే ఉందంటాడు. ఇంతకు ముందు వారూ వీరూ భయపడ్డారన్న వాడు చూచారా ఇప్పుడు తనకే భీతాహంగా ఉందని స్వయంగానే ఒప్పుకొంటున్నాడు. దివ్యదృష్టి బలం లేని మిగతా వారు భయపడ్డారంటే కొంత అర్థముంది. తానెందుకు భయ పడాలి. తనకు భగవానుడిచ్చిన ఆయుధం దివ్య దృష్టి ఉంది గదా. అది కూడా పనిచేయటం లేదన్న మాట. అప్పటికీ విశ్వరూపాన్ని సమస్త దేశకాల పాత్రలతో సహా ఒక్కసారిగా దర్శించి జీర్ణం చేసుకోవాలంటే ఒకరిచ్చే దృష్టి కాదు. తన

Page 413

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు