#


Index

విశ్వరూప సందర్శన యోగము

కాని ప్రయోజనం లేకపోయింది. అందుకే యధాశక్తిగా హితం కోరుతూ తప్పు కొంటున్నారు. ఇదంతా ఇక జరగబోయే విషయం. అది కూడా చూస్తున్నాడంటే భూత భవిష్యద్వర్త మానాలనే తేడాలేకుండా విశ్వరూపంలో అన్నీ దర్శన మిస్తున్నాయన్న మాట.

రుద్రాదిత్యా వసవో యేచ సాధ్యా
విశ్వేదేవా మరుత శ్చోష్మపాశ్చ
గంధర్వ యక్షాసుర సిద్ధసంఘా
వీక్షంతే త్వాం విస్మితా శ్చైవ సర్వే - 22


  అంతే కాదు. వసురుద్రాదిత్యులూ - సాధ్యులూ - ఊష్మవులూ అంటే సూర్యకిరణా లాహారంగా సేవించే పితృగణాలూ - హా హా హూహూ ప్రభృతులైన గంధర్వులూ కుబేరాది యక్షులూ - విరోచనాదులైన అసురులూ కపిలాది సిద్ధులూ - ఇలాటి జాతులన్నీ విస్మితాః ఆశ్చర్యంతో చకితులయి నిన్ను గుడ్లప్పగించి చూస్తున్నారంటాడు. ఎక్కడున్నారు వీరంతా. ఆయా లోకాంతరాలలో. దీన్ని బట్టి కాలభేదమే గాక దేశ భేదాన్ని కూడా దాటిపోయిందా విశ్వరూపం. అంతేకాదు వస్తు భేదం కూడా. దేశకాల వస్తువులనేవి మూడు వరిచ్ఛేదాలు Three Dimensions. అవి దాటిపోయిందంటే అది అనంతమనే మాట సార్ధక మవుతున్నది. అందుకే చూచే వారికంతా ఆశ్చర్యం - భయం.

Page 412

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు