ప్రవేశిస్తున్నారట. కొందరైతే భయపడిపోయి చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తూ లోలోపల ఏదో గొణుగుతున్నారట. మరి మహర్షులూ సిద్ధులూ అయితే స్వస్తి స్వస్తి జగత్తు కంతా మేలు కలుగు గాక అని దీవిస్తూ కూచున్నారట. ఏమిటిదంతా. దేవతలు ఆయనలో ప్రవేశించటమేమిటి. మిగతా వారు హడలిపోయి నమస్కరించట మేమిటి.
భగవత్పాదులు దీన్ని మరొక విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. అమీ హిత్వా వీరందరూ అనే మాట పట్టుకొన్నారాయన. అక్కడ ఉన్న యోధవీరులే అందరూ అనే మాట కర్ధం. వారు దేవత లేమిటని అడిగితే ఆయన అంటారు. భూభారం తగ్గించటానికి మానవ శరీరాలతో అవతరించిన వస్వాది దేవతలేనట వారంతా. అష్టమ వసువే గదా భీష్మడి రూపంగా జన్మించాడు. అలాగే ద్రోణ కర్ణ దుర్యోధనాదులంతా ఆయా దేవతాంశలలో జన్మించినవారే. వారందరూ ఆయన ముఖంలో ప్రవేశించట మర్జునుడు చూచాడంటే కౌరవులను తాము జయించటం ఖాయమని పరమాత్మ అతనికి భంగ్యంతరంగా సూచించటమే. కొందరు పలాయనం చేయటానికి కూడా అశక్తులయి ఆయనను స్తుతిస్తున్నారంటే విదుర సంజయాదుల లాంటివారని అర్థం చేసుకోవాలి మనం. మరి మహర్షులూ సిద్ధులూ స్వస్తి వాచనం చెప్పటమేమిటి. ఎవరో గాదు. వ్యాస నారద మార్కండేయాదులు. భారత యుద్ధం జరగటం వారి కిష్టం లేదు. దానివల్ల లోకాని కనిష్టమని ముందుగానే ఊహించి ఎంతగానో దాన్ని నివారించటానికి యత్నించారు.
Page 411