ప్రవ్యధితం - మూడులోకాలూ భయపడిపోతున్నాయని కూడా అంటాడు. రోదసీ కుహరమంతా వ్యాపించిన ఆ రూపమీ అర్జునుడికెలా కనిపించింది. ఎక్కడ ఉండి చూచాడు. ఏ రూపంలో తానుండి చూచాడు. దివ్యదృష్టితో చూచాడంటారా. చూస్తే భయం దేనికి. భయం తనకు గాదు. లోక వాసులందరికీ నంటాడా. వారు భయపడుతున్నారని తనకెలా తెలిసింది. వారు వచ్చి తనకు చెప్పారా.
నిజానికి భయం వారికి గాదు. తనకే. తానే మొదట తెలియక చూడాలని ఉబలాట పడ్డాడు. తీరా ఆయన చూపేసరికి చూడలేక హడలి పోతున్నాడు. తన భయం బయటపెట్టకుండా తతిమా వాళ్లంతా భయపడుతున్నారట. ఇది ఎలా ఉన్నదంటే మీకందరికీ భయమేస్తే నా చుట్టూ వచ్చి పడుకోమన్నాడట ఒకడు. అలా ఉందిది కూడా.
అమీ హిత్వా సురసంఘా విశంతి
కేచి ద్భీతాః ప్రాంజలయో గృణంతి
స్వస్తీ త్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః - 21
ఇంకా ఏమి చూస్తున్నా డర్జును డాయన శరీరంలో. అమీ హిత్వా సురసంఘా విశంతి - కేచిద్భీతాః ప్రాంజల యో గృణంతి. స్వస్తీ త్యుక్త్వాస్తు వంతి మహర్షి సిద్ధ సంఘాః దేవతలందరూ ఆయన ముఖంలో
Page 410