నతనికివ్వ వలసిన అవసరం లేదు. జ్ఞానమే దివ్య దృష్టి. ఇక క్రొత్తగా ఏముంది దివ్యదృష్టి అనేది. ఒకవేళ అది పెట్టుకొని చూచినా జ్ఞానే అయితే ఆ విశ్వాన్ని చూచి భయపడడు. జ్ఞాని అయిన దాడీ విశ్వాన్ని చూచినా వాడికి భయం లేదు. ఆ విశ్వాన్ని చూచినా లేదు ఎందుకంటే ఆరోపితాన్ని అధిష్ఠాన చైతన్యంగా దర్శించటమే అసలైన జ్ఞానం. అది బాహ్యంలోనే గాని భావంలో లేదర్జునుడికి. అందుకే ఒక మాట మీద నిలవకుండా ఎప్పుడేది తోస్తే అప్పుడది మాటాడుతున్నాడు.
ద్యావా పృధివ్యో రిద మంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
దృష్ట్యాద్భుతం రూపమిదం తవో గ్రం
లోకత్రయం ప్రవ్యధి తం మహాత్మన్- 20
ఇంకా ఏమంటున్నాడో చూడండి. ద్యావా పృథివ్యోరిద మంతరం హివ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః - ద్యావా పృథ్వు లంటే భూమ్యాకాశాలు. అంతరమంటే రెండింటి నడుమా ఉన్న ఖాళీ. దాన్నే అంతరిక్షమని రోదసి అని పేర్కొంటారు. దానికన్ని వైపులా ఉండేవి సర్వా దిశః - దశదిశలూ మొత్తం మీద వీటన్నింటినీ త్వయైకేన వ్యాప్తం. నీవొక్కడవే వ్యాపించి కనిపిస్తున్నావంటాడు. అంతేకాదు. దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం. ఇలాటి భయంకరమైన అద్భుతమైన నీరూపాన్ని చూచి. లోకత్రయం
Page 409