#


Index

విశ్వరూప సందర్శన యోగము

గాదు. అ ప్రమేయం. ఆత్మ స్వరూపం. అలాటి స్వరూప జ్ఞానముందా ఇప్పుడర్జునుడికి. ఉంటే ఈ మాట అనడు మళ్లీ. ఏమాట. అనంత వీర్య మనంత బాహుం శశి సూర్య నేత్రం. ఎంతో పరాక్రమం. ఎన్నో బాహువులు. సూర్యచంద్రులే నేత్రాలూ - అని ఆయనను వర్ణిస్తున్నాడు మరలా. ఇది సగుణమా. నిర్గుణమా. దీప్త హుతాశ వక్త్రం - వెలిగిపోతున్న అగ్నిహోత్రుడి లాటి ముఖమట అది. స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆ తేజస్సులో ఈ విశ్వాన్నంతా దహించి వేస్తున్నాడట. అలాంటి పరమాత్మను పశ్యామిత్వాం. నిన్ను నేను చూస్తున్నానంటాడు. ఇది నిజమా. ఇంత ఉగ్రమైన రూపం తన ఎదుట సాక్షాత్కరిస్తున్నది సగుణం గాక నిర్గుణమని ఎలా అనుకోవాలి మనం.

  ఒకవేళ ఈశావాస్యం వర్ణించినట్టు అనేజ దేకం మనసోజవీయః అని - శ్వేతా శ్వతరం వర్ణించినట్టు అపాణి పాదో జవనో గ్రహీతా అని నిర్గుణంగా సగుణంగా రెండు విధాలుగా చూస్తున్నాడా పరమాత్మ నర్జునుడు. అలా చూడగలిగితే మంచిదే. కాని అలా చూచినవాడే అయితే అధిష్ఠాన దృష్టి నేమరడు. రెండింటినీ సమన్వయించుకొని గొప్ప జ్ఞాని అనిపించుకునే వాడు. జ్ఞానే అయితే కనిపించే విశ్వాన్నే భగవ ద్విభూతిగా చూచి అక్కడికి తృప్తి జెందేవాడు. అంతేగాని క్రొత్తగా మరొకటేదో ఉంది. విశ్వం. దాన్ని ఆయన చూపితే చూడాలని తాపత్రయ పడడు. పడలేదే అనుకో. దివ్యదృష్టి

Page 408

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు