#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

తాను దాన్ని ఎంతవరకు వ్యాపిస్తున్నదో అది ఈశ్వరుడయింది. రెండుగా చూస్తే ఈశ్వరుడూ ఉపాధిగా విభక్తం. రెండూ పరమాత్మ చైతన్యమే గదా సచ్చిత్తులే గదా అని భావిస్తే అవిభక్తంగా రెండూ కలిసి పరమాత్మ స్వరూపమే.

  అప్పుడు పృధివ్యాదులైన విభూతీ లేదు. రసగంధరూపంగా వాటిలో చేరిపోయిన ఈశ్వరుడనే విభువూ లేడు. ఒకే ఒక పరమాత్మ ఆడుతున్న నాటకమే ఇది. అందులో విభువుగా ఒక పాత్ర. విభూతిగా ఒక పాత్ర ధరించి పరమాత్మే ఈ ద్విపాత్రాభినయం చేస్తూ కూచున్నాడు. ఇదుగో ఆ విభువే ఈశ్వరుడు. విభూతే దాని కుపాధిగా గోచరించే ఈ చరాచర ప్రపంచమూ. ఇదీ చివరకు తేలిన సారాంశం.

  పోతే ఇప్పుడా పరమాత్మ అనండి. ఈశ్వరు డనండి. అవి రెండూ త్రిగుణా తీతమైన తత్త్వాలు. ప్రకృతి గుణాలు వారి మీద పని చేయవు. ఎందుకంటే ఒకటి శక్తిని తన లోపల గుప్తం చేసుకొని బయట పెట్ట లేదు. మరొకటి శక్తిని తన కధీనం చేసుకొని తద్ద్వారా బయటపడ్డది. పడ్డా పడకున్నా మాయాశక్తి వాటి కధీనమయ్యే ఉంది కాబట్టి దాని గుణాలు ఆ రెండు తత్త్వాలనూ సోకవు. సోకలేవు. అందుకే సాత్త్విక రాజసతామస భావాలు నాలో నా అధీనంలో ఉండవలసిందేగాని వాటిలో నేను బందీ అయి ఉండనని అంత ఘంటాపథంగా చెబుతున్నాడు భగవానుడు. నిర్గుణుడైన పరమాత్మ అసలే బందీకాడు. సగుణుడైనా ఈశ్వరుడు విశుద్ధ

Page 41

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు