నేను. నేననే స్ఫురణ. చిత్తు. అస్మి అంటే ఉండటం గదా సత్తు. అంటే ఏమన్న మాట. ఉండటమనే స్ఫురణ మాత్రమే అది. అంతవరకే అయితే అది ఇక్కడా అక్కడా అనే తేడా లేదు. అన్నింటిలో వ్యాపిస్తుంది. బలంలో వ్యాపిస్తుంది. రసంలో వ్యాపిస్తుంది. జలంలో వ్యాపిస్తుంది. బలవంతుడిలో వ్యాపిస్తుంది. దానికేదీ అడ్డురాదు. ఎందుకంటే బలమైనా ఉందనే స్ఫురణే. బలవంతుడైనా ఉందనే స్ఫురణే. తపస్సయినా ఉందనే స్ఫురణే. తపస్వి అయినా ఉందనే స్ఫురణే. The awareness of the presene of all things alike. అది ఈశ్వరుడు కాదు. న్యాయమైతే దాన్ని బ్రహ్మ మనాలి. పరమాత్మ అనాలి. లేదా ఊరక ఆత్మే ననాలి.
మరి అలాంటప్పుడీశ్వరు డీశ్వరుడని ఎందుకు వర్ణిస్తూ వచ్చారింత వరకూ. ఈశ్వర అంటే ఏదోనని ఉలిక్కి పడకండి. ఏది తన అదుపులో ఉంచుకొంటుందో ఆ భావ మీశ్వర. దానికేవీ నామరూపాలు లేవు. చైతన్యమే అది. కేవలమలాగే ఉంటే ఆ చైతన్యం పరమాత్మ. బ్రహ్మం. అదే చరా చర పదార్ధాలలో ఆయా రస గంధాదులుగా ప్రవేశించి వాటికి అధిష్ఠానమయి Basis తన వశంలో ఆ ఉపాధుల నుంచుకొంటే అదే అంతర్యామి Inner controller, ఈశ్వరుడు Master or commander. దానికి కారణం మాయాశక్తి. దానికి వేరుగాదు. దాని శక్తే అది. పరమాత్మ శక్తే. దానికి పనిపెట్టక పోతే అది పరమాత్మే. పని పెట్టి దాని ద్వారా వ్యాపిస్తూపోతే అది ఈశ్వరుడు. వ్యాపించటమనే సరికి దేన్ని వ్యాపిస్తుందో అది ఉపాధి అయింది. అందులో
Page 40