వస్తుంది. పోతే ఆధారా ధేయాలుగా గీత ఏకరువు పెట్టిన రెండూ కూడా ఆధేయాలే వాస్తవానికి.
అయితే ఇక ఆధారమేమిటి. రెంటికీ కలిపి ఒక్కటే ఆధారం. వాటిలాగా ఎక్కడికక్కడ మారిపోయే ఆధారం కాదది. సర్వత్ర అనున్యూతంగా వ్యాపించే ఆధారం. సర్వాధారం. ఏమిటది. ఎక్కడ ఉంది. ఇంతవరకూ వర్ణిస్తూ వచ్చిన వాక్యాలలో గుప్తంగా ఉందది. అదే అహం అదే అస్మి. రెండూ కలిసి అహమస్మి. అదే నేను పేర్కొన్న మూడవ అంశమా వాక్యాలలో. రసోహ మప్సు అనే వాక్యంలో జలం కాదు. రసం కాదు. అహ మనే భాగమది. అలాగే తేజశ్చాస్మి అనేచోట అస్మి అనే భాగమది. చూడండి ప్రతి వాక్యంలో మొదటి రెండే కాక వాటి కదనంగా అహమస్మి అనే మూడవది కూడా మనకు దర్శన మిస్తూనే ఉంది. అంతేకాదు. అవి రెండూ ఎక్కడికక్కడ మారుతున్నా ఆ మూడవదైన అహమస్మి అనే మాట మారటం లేదు. గమనించారా. ఇదుగో ఇదే అసలైన ఈశ్వర చైతన్యం. అది రసమూ కాదు జలమూ కాదు. అవి రెండూ కూడా దాని కుపాధులు ఒకదానికొకటి గాదు. రెండూ దానికు పాదు లన్నప్పుడు రెంటికీ అది విలక్షణం. రెంటికీ విలక్షణమయి మరలా రెండు పాధులుగా కూడా అదే భాసిస్తున్నది. అప్పటికది స్వరూపమైతే ఇవి రెండూ దాని విభూతి అని అర్ధం చేసుకోవాలి మనం.
అలాంటప్పుడు న్యాయమైతే దాన్ని ఈశ్వరుడని పేర్కొనగూడదు మనం. అహ మస్మి అని గదా దాని చిరునామా. అందులో అహమంటే
Page 39