గాక ఉపాధులలో సారభూతంగా ఉన్నదని వాటి కాధారభూతంగా ఉన్నదని వర్ణించిన రసాదులు కూడా మారుతున్నట్టే కనిపిస్తున్నాయి వాస్తవానికి. ఎలాగంటే జలంలో రసమైతే పృధివిలో గంధమైతే అగ్నిలో తేజస్సయితే బలవంతులలో బలమైతే తపస్వులలో తపస్పైతే ఇలా ఆయా ఉపాధులు మారుతున్నట్టే వాటికాశ్రయమైన రసాదులు కూడా మారుతూనే ఉన్నాయి గదా. అవే ఈశ్వరు డన్నప్పుడా ఈశ్వరుడను స్యూత Persistant మెలా అయ్యాడు. ఆయనా వాటిలాగే ఆయా గుణాలుగా మారిపోతున్నాడు గదా అని ఒక పెద్ద సందేహమిక్కడ.
దీని మీద ఇప్పుడు విచారణ చేయవలసి ఉంది మనం. రసోహమప్సు బలం బలవతా మస్మి - అనే వాక్యాలలో రెండు గాదు. మూడున్నాయి అంశాలు మనం గుర్తించ వలసినవి. మనమింత వరకూ రసమూ జలమూ అని రెండుగానే విభజించి వాటిలో జలమనేది ఉపాధి అనీ రసమనేది దాని కాధారమనీ చెప్పుకొని అక్కడికే ఆగిపోయాము. కాదు. ఆగిపో గూడదు. పోతే ప్రమాదం. ఏమిటో తెలుసా. జలమనే ఉపాధి పృధివి దగ్గరికి వచ్చేసరికి మారిందని గదా అంటున్నావు. అలాగే జలాని కాశ్రయమని చెప్పిన రసం కూడా పృధివి కాశ్రయమైన గంధం దగ్గర మారిపోయింది గదా. మారితే అది వ్యాపకమెలా అయింది. రసగంధాదు లీశ్వరుడని వర్ణించినప్పు డీశ్వరుడు కూడా మారిపోతాడు గాని వ్యాపకమెలా కాగలడు. అప్పటి కాధేయమైన పృధివ్యాదులెలా వ్యాపకం కాదో వాటి కాధారమని వర్ణించిన ఈశ్వరుడు కూడా వ్యాపకం కాకుండా పోవలసి
Page 38