#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

చైతన్యమే గనుక అదే ఆధారం Basis. దాని నంటి పట్టుకొని బ్రతుకుతున్నది గనుక ఉపాధి దాని కాధేయమని చెప్పాము. ఉపాధి అన్నప్పుడు అది ఎక్కడో ఏ పదార్ధానికో పరిమితమని కాదు మన మర్ధం చేసుకోవలసింది. భూత భౌతిక సృష్టి యావత్తూ ఉపాధి క్రిందికే వస్తుంది. అలాగే వర్ణిస్తూ వచ్చాడు మహర్షి ఆయన వర్ణన సృష్టినంతా గాలించినట్టయింది. ఎలాగంటే పృధి వ్యాదులైన పంచభూతాలూ పేర్కొన్నాడు. మానవుడు మానవుడు సృష్టించిన వేద వాఙ్మయాన్నీ చెప్పాడు. మానవుడి బుద్ధి - పరాక్రమమూ ధర్మా ధర్మాదులూ చెప్పాడు. అంతేగాక బీజం మాం సర్వభూతానా మనటంలో జడ చేతన పదార్థా లన్నింటినీ ఏకరువు పెట్టాడు. మొత్తం మీద చరా చర సృష్టి అంతా కలిసి వచ్చింది. ఇంకా కొరవా సరవా ఏమయినా ఉందేమో ననే అనుమాన మెవరికీ కలగకుండా యే చైవ సాత్త్వికా భావా అనే శ్లోకం ద్వారా జడచేతనాత్మకమైన సమస్తమైన సృష్టినీ గతార్ధం చేసి చూపాడు. ఇక ఏదీ మిగలలేదు ఉపాధి అనేది.

  పోతే ఇప్పుడీ ఉపాధు లన్నింటినీ తన లోపల ఇముడ్చుకొని వీటి ద్వారా మరలా అభివ్యక్త మవుతున్న దోకే ఒక తత్త్వం. అది ఏదోగాదు. అంతర్యామి రూపంగా ఉన్న ఈశ్వర చైతన్యమే సుమా అని గుర్తు చేస్తున్నాడు మనకు మహర్షి. అదే ప్రతి వర్ణనలోనూ అహం - అస్మి అనే మాటలలో మనకు సూచన చేస్తూ వచ్చాడు. ఈ అహ మస్మి అనే మాట ఎక్కడా మారదు. అనుస్యూతంగా వస్తూ ఉంటుందన్ని ఉపాధులలో. కాగా ఆ ఉపాధులే మారుతున్నాయి. అయితే ఒక సూక్ష్మమేమంటే ఉపాధులే

Page 37

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు