వాస్తవమయి అవి తన కాభాస అయిపోతాయి. కనుకనే నాలో అవే గాని వాటిలో నేను కానని చాటటం. ఇంతకూ సృష్టి అయిన చరా చర పదార్ధాలన్నీ త్రిగుణాత్మకమైతే పరమాత్మ ఒక్కడూ త్రిగుణా తీతుడని చెప్పినట్టయింది. త్రిగుణాలకు విలక్షణమైన తత్త్వం గనుకనే అది త్రిగుణాలలో ఉండట మసంభవం. కాని అది తప్ప వేరే ఆశ్రయం లేదు కాబట్టి మిగతా ప్రపంచమంతా దానిమీదనే ఆధారపడి అందులోనే ఉండక తప్పదు. ఈ కారణం వల్లనే రసోహ మప్సు అని మహర్షి మొదటి నుంచీ ఉల్టాగా చెప్పినా మరలా దాన్ని సీదా చేసి జలంలో రసం కాదు రసంలోనే జలమని సవరించి చెప్పవలసి వచ్చింది భాష్యకారులు. మరి వ్యాసుడెందుకలా తలక్రిందులుగా చెప్పాడు. పైకి అలా చెప్పినా ఆయన ఉద్దేశం వేరు. సమస్త ప్రపంచంలో ఏ సారభూతమైన తత్త్వముందో అది కేవల మా ఈశ్వర చైతన్యమే. అదే పదార్ధాలుగా మనకు భాసిస్తున్నదని భంగ్యంతరంగా బోధించటమే ఆయన వివక్షితం. అదే ఆయన వర్ణిస్తున్నప్పుడు మనకు ప్రతిలోమంగా కనిపిస్తున్నది. అంతమాత్రమే.
త్రిభి ర్గుణమయై ర్భావై - రేభి స్సర్వమిదం జగత్
మోహితం నాభిజానాతి - మామేభ్యః పర మవ్యయమ్ - 13
రసోహ మప్సు అనే శ్లోకం దగ్గరి నుంచీ బలం బలవతా మనే శ్లోకం వరకూ ఆ నాలుగు శ్లోకాలలో రెండేసి విషయాలు వర్ణిస్తూ వచ్చాడు వ్యాసభగవానుడు. ఒకటి లోపల ఉన్న ఈశ్వర చైతన్యం. ఇంకొకటి బాహ్యంగా కనిపించే దాని ఉపాధి Form. అందులోనూ సారభూతమైనది
Page 36