#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

కనిపించకుండా ఉన్న దాని తాలూకు వివిధ రూపాలే గాని వీటికి ప్రత్యేకమైన అస్తిత్వమేదీ లేదు. అది ద్రవ్యం Substance ఇది దాని రూపం form. పౌరాణిక భాషలో చెబితే అది దేవత Spirit ఇది భూతం Matter. అది లేకుంటే ఇది లేదు. అదే ఇది.

యే చైవ సాత్త్వికా భావా - రాజసా స్తామసా శ్చయే
మత్త ఏవేతి తా న్విద్ధి - నత్వహం తేషు తేమయి - 12


  ఇంత దూరం దేనికి. సాత్త్వికం - రాజసం - తామసం అని మూడే భావాలెక్కడ చూచినా ఈ సృష్టిలో. సత్త్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడ్డవే. స్థావరా లేమిటి - జంగమా లేమిటి. ఏది ఎక్కడ ఎప్పుడు నీకూ నాకూ దర్శన మిచ్చినా సరే. అది ఈ మూడు గుణాలకు సంబంధించిన పదార్ధమే అయి ఉంటుంది. దీనికి తిరుగు లేదు. కాగా మేమిప్పుడు చెప్పబోయే దేమంటే మత్త ఏవేతి తాన్విద్ధి అంటున్నాడు భగవానుడు. ప్రతి పదార్ధమూ నావల్లనే బయటపడి కనిపిస్త్న్నుది. అన్నీ నాలోనుంచి రావలసిందే మరెక్కడి నుంచీ గాదు. అన్నిటికీ నా చైతన్యమే ఆధారం. నా అస్తిత్వమే వాటి అస్తిత్వం. అంతకన్నా స్వతంత్రమైన సత్తా లేదు దేనికీ.

  కాని ఒక చిత్ర మేమంటే నత్వహం తేషు - తే మయి. నాలోనే అవి ఉంటాయి గాని నేను మాత్రం వాటిలో లేనంటాడు పరమాత్మ. ఏమి కారణం. తాను వాటిలో ఉన్నాడంటే అవి తనకాధార మయి తాను వాటి కధీనం కావలసి వస్తుంది. అలాగైతే అవి వాస్తవమయి తాను అవాస్తవం లేదా ఆభాస కావలసి వస్తుంది. అలా కాక అవే తనలో ఉంటే తానే

Page 35

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు