సమస్త భూతాలూ ఇలా పుడుతూ చేస్తూ ఉన్నాయంటే వాటి జన్మకు బీజభూతమైన వాడను నేనేనని తెలుసుకోమంటాడు. అంతే కాదు. బుద్ధి జీవులైన మానవుల బుద్ధి బలం నేనే. తేజ స్తే జస్వినాం. వారి ప్రాగల్భ్యం లేదా సామర్ధ్యం కూడా నేనే. బలశాలులైన ప్రాణుల బలం నేనే. అది కూడా కామరాగ వివర్జితం - ఒకటి లభిస్తే బాగుండునని కోరితే కామం. లభించిన దాని మీద ఆసక్తి పెంచుకొంటే అది రాగం - ఇవి రెండూ లేని సాత్త్వికమైన బలమే ఈశ్వర స్వరూపం. అలాగే జీవుల కామం కూడా నేనే. కాని ధర్మా విరుధ్ధః ధర్మమార్గానికి విరుద్ధ మనిపించుకో గూడదది. ముందు చెప్పినట్టు నిర్దోషమూ సమమూ గదా భగవత్తత్త్వం. ఏదోషమున్నా అది సమం గాదు. విషమమయి పోతుంది. కనుక బలమైనా కామమైనా ఏ గుణమైనా నిర్దోషంగా ఉంటేనే అది ఈశ్వర స్వరూపం.
ఏతావతా తేలిన సారాంశ మేమిటి. పృధివ్యాదుల దగ్గరి నుంచీ ప్రతిపదార్ధంలో ఉన్నది నేనే నేనేనని పరమాత్మ చెబుతున్నా వాటిలో ఉన్నది పరమాత్మ గాదు. వాస్తవానికి పరమాత్మ చైతన్యంలోనే తలదాచు కొంటున్నాయి అన్నీ. అన్నిటికీ ఆధారం పరమాత్మ. ఆధేయ మవన్నీ. ఆధారం లేకుంటే ఆధేయమైన పదార్థం లేనట్టే ఈశ్వర చైతన్యమనే ఆధారం లేకుంటే ఈ పృధివ్యాదులేవీ నిలవలేవు. అభావమయి పోతాయి. పరమాత్మ శక్తి అయితే ఆశక్తి వ్యక్తమైన రూపాలే ఈ పృధివ్యాదులన్నీ. అది వస్తువు. ఇదంతా దాని విభూతి. అంటే ఏమని అర్ధం. ఈశ్వర చైతన్యమే పృధివ్యాది ప్రపంచ రూపంగా ఇలా బయటపడి కనిపిస్తున్నది. ఈ కనిపించేవి
Page 34