#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము భగవద్గీతా సర్వస్వము

అంటున్నది గీత. మిగతాచోట్ల పుణ్యమనే విశేషణం వాడ లేదు. అయినా వాటికి కూడా ఇది వర్తిస్తుందని సెలవిచ్చారు గురువుగారు. అన్ని భూత గుణాలూ పుణ్యమే. పరిశుద్ధమే. కారణమేమంటే నిర్దోషం హి సమం బ్రహ్మ అని గదా వర్ణించారు పరమాత్మను. సమంగా వ్యాపించిన దెప్పుడూ నిరాకారం. నిరాకారం గనుక నిర్దుష్టం - పరిశుద్ధం కాక తప్పదు. పుణ్యమంటే పరిశుద్ధ మనే అర్ధం.

  తేజశ్చాస్మి విభావసౌ అగ్నిలో ఉన్న తేజస్సు లేదా ఉష్ణగుణం పరమాత్మే నట. జీవనం సర్వభూతేషు. సమస్త ప్రాణులకూ ఆశ్రయమైన జీవనం ప్రాణశక్తి నేనేనంటాడు. పృధివీ జలమూ - తేజస్సూ - ఆకాశమూ ఇంతకు ముందే పేర్కొన్నారు కాబట్టి అయిదింటిలో నాలుగు భూతాల ప్రస్తావన ఇంతకు ముందే వచ్చింది. పోతే వాయువొక్కటి ప్రస్తావించలేదు. ఇప్పుడీ జీవనమనే మాటలో వాయువును కూడా చెప్పుకొంటే సరిపోతుంది. వాయువు చేతనే గదా జీవులందరూ జీవిస్తున్నారు. కనుక జీవనమంటే వాయువు. అప్పటి కయిదు భూతాలూ వచ్చేశాయి. అయిదింటికీ ఆధార మీశ్వర చైతన్యమే. తపశ్చాస్మి తపస్విషు - తాపసులలో ఉన్న తపశ్చర్య నేనేనంటాడు.

బీజం మాం సర్వభూతానాం - విధి పార్ధ సనాతనమ్
బుద్ధి ర్బుద్ధి మతా మస్మి తేజస్తే జస్వినా మహమ్ - 10


బలం బలవతాంచాహం- కామరాగ వివర్జితమ్
ధర్మా విరుద్ధో భూతేషు - కామోస్మి భరతర్షభ - 11

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు