చైతన్యమే. అందులోనే ఉందీ జలమనే భూతమని వ్యాఖ్యానించా రాయన.
అంటే తన్మాత్రలనేవి భూతసూక్ష్మాలు. అవే ఆధారం భూతాలకు. సూక్ష్మమే
స్థూలాని కాధారమని చెప్పినట్టయింది. అన్నింటికన్నా అతి సూక్ష్మం
నిరాకారమైన ఆత్మ చైతన్యం. కనుక అది ఒక జలమేమిటి తేజస్సేమిటి
పృధివేమిటి. సమస్త ప్రపంచాన్నీ సామాన్యరూపంగా వ్యాపించి ఉంది.
విశేషాలన్నీ సామాన్యం మీదనే గదా ఆధారపడ వలసింది. తరంగ
బుద్బుదాదుల కాధారం సముద్ర జలమే గదా. అలాగే ఇక్కడా. కాబట్టి
ఇక్కడ అప్సు రసః జలంలో రసమని వర్ణించినా వాస్తవంగా రసంలోనే
జలమని అర్థం చేసుకోవాలి మనం. ఒక్క రసమూ జలమే గాదు. ఏవం
సర్వత్ర అన్నారాయన. తరువాత చెప్పబోయే వన్నీ ఇలాగే చూడమంటాడు.
ప్రభాస్మి శశి సూర్యయోః కాంతిరూపంగా ఈశ్వరుడుంటే దాన్ని
ఆశ్రయించి ఉన్నాయి సూర్యచంద్ర గోళాలు. ప్రణవ స్సర్వవేదేషు - ఓంకార
రూపం పరమాత్మ అయితే దాని నాశ్రయించి ఉంది వేద వాఙ్మయమంతా.
శబ్దః ఖే. శబ్ధ గుణ మీశ్వరుడైతే అదే ఆధార మాకాశానికి. పౌరుషం
నృషు. పురుషులలో ఉన్న పురుషత్వ మీశ్వరుడే. పురుషత్వమే
పురుషులందరికీ ఆశ్రయం.
పుణ్యోగంధః పృధి వ్యాంచ- తేజ శ్చాస్మి విభావసౌ
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు - 9
పుణ్యోగంధః పృధి వ్యాంచ. పృధివిలో ఉండే గంధతన్మాత్ర ఈశ్వరుడే. దాని నాశ్రయించి ఉంది పృధివి. చూచారా ఇక్కడికి వచ్చేసరికి పుణ్యోగంధః
Page 32