ఒకే తత్త్వం. అలా భావించి నప్పుడిక ఆధారా ధేయాలు రెండూ ఒకే తత్త్వమని బోధ పడుతుంది. ఇదేనేమో వ్యాసమహర్షి హృదయం. సరే ఏమయితే నేమి. కార్యకారణాలు రెండూ ఈశ్వర చైతన్యమేనని తేలిపోయింది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనే ఉపనిష త్సిద్ధాంతం కూడా దీనితో కలిసి వచ్చింది.
రసోహ మప్సు కౌంతేయ - ప్రభాస్మి శశి సూర్యయోః
ప్రణవ స్సర్వ వేదేషు - శబ్దః ఖే పౌరుషం నృషు - 8
రసోహ మప్సు - జలంలో ఉన్న రసాన్ని నేనేనంటున్నాడు పరమాత్మ. జలంలో అంటే అది ఆధారమయింది. రసమంటే అది ఆధేయ మవుతున్నది రసం పరమాత్మే నన్నప్పుడు పరమాత్మ ఆధేయమై దానికి జల మాధారం కావలసి వస్తుంది. పరమాత్మ అంటే వస్తువు గదా. జలం లాంటి పదార్ధాలన్నీ పరమాత్మ చైతన్యాని కాభాసలని గదా నిరూపించాము. ఆ భాసకు వస్తువాధార మవుతుంది గాని వస్తువు కాభాస ఆధారమెలా అవుతుంది. అలాగైతే పరమాత్మకు జలమే ఆధారమది లేకపోతే పరమాత్మ కస్తిత్వమే లేదని చెప్పవలసి వస్తుంది. మరి ఇదేమిటి భగవద్గీత ఇలా చెబుతున్నదని ప్రశ్న వస్తున్న దిప్పుడు.
ఇది ఈనాడు మనకే గాదు. ఆనాడు భగవత్పాదులకే వచ్చిం దనుమానం. అందుకే ఆయన ఇలా వ్రాస్తున్నారు దానికర్ధం. అపాం యస్సారః స రసః - తస్మిన్ రసభూతే మయి ఆపః - ఇత్యర్థః జలానికి సారం రసం. అంటే ద్రవత్వమే దాని స్వరూపం. అది ఏదోగాదు. ఈశ్వర
Page 31