#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

భాష్యకారులకు. ఈ చెప్పిన ఉపమానంలో సూత్రం పూసల కాధారమైనా దాని జాతి వేరు పూసల జాతి వేరు. పూసలే దారం గాదు. దారమే పూసలు కాదు. ఆధారాధేయ భావముంది రెంటికీ. అలాగైతే ద్వైత భావమే కనిపిస్తుంటుంది. పూర్తి అద్వైతం కాదు. అందుకే స్వామివారు మరొక ఉపమానం జోడించారు దానికి. దీర్ఘతంతును పటవత్త న్నారాయన. పడుగు పేకగా ఉన్న దారాలలో వస్త్రంలాగా అని అర్ధం దానికి. వస్త్రమేదో గాదు దారాల సమూహమే. దారాలన్నీ లాగేస్తే వస్త్రం లేదు. ఆభాస అయిపోతుంది. అలాగే కారణభూతమైన సత్తాస్ఫూర్తులు తీసేస్తే భూత భౌతిక పదార్ధాలేవీ కనపడవు. దారాలే వస్త్రంగా భాసించినట్టు సచ్చిద్రూపుడైన ఈశ్వరుడే జగదాకారంగా దర్శన మిస్తున్నాడన్న మాట. ఎంత గొప్ప అద్వైతదర్శనమో చూడండి ఇది.

  అయితే మరి వ్యాసభగవాను డెందుకన్నట్టు ఆ మాట. సూత్రేమణి గణా అని గాక తంతుష్వేవ పటోయధా అనవచ్చు గదా. నిజమే. ఆయన అంచెల వారీగా మన కద్వైత భావం బోధించా లనుకొన్నాడు. మొదట ఆధారాధేయాలను వేరుగా చూపి తరువాత లోతుకు దిగి ఆలోచిస్తే ఆ ధేయమేదో గాదు అది కూడా ఆధారమే సుమా అని చెప్పట మాయన ఉద్దేశం. అది ఎలాగో చెబుతాను వినండి. సూత్రమూ మణులూ పైకి చూస్తే విజాతీయంగా కనిపిస్తాయి. అప్పుడక్కడ ఒకటి ఆధారం వేరొకటి ఆధేయం. రెంటికీ తేడా ఉంది. కొంచెం లోతుకు దిగండి. సూత్రమూ పృధివీ వికారమే. మణులూ పృధివీ వికారమే. పృధివీ రూపంగా రెండూ

Page 30

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు