#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

లేదు కాబట్టి కారణాంతరం లేదనే మాట యథార్థమే. కాని కారణం వేరుగా లేనట్టే కార్యమైన ఈ జగత్తు కూడా అన్యంగా లేదీశ్వరుడికి. ఆ అర్థం చెప్పినా చెప్పవచ్చు. తదనన్యత్వ మారం భణ శబ్దాదిభ్యః అని సూత్రముంది బ్రహ్మ సూత్రాలలో. కారణం కన్నా దాని కార్యం వ్యతిరిక్తంగా లేదని అద్వైతుల సిద్ధాంతం. కేవల నిమిత్త కారణానికైనా వేరుగా ఉంటుందేమో గాని అదే ఉపాదానం కూడా నని నిర్ణయించినప్పడిక ఏ మాత్రమూ అన్యంగా ఉండటానికి లేదు కార్య ప్రపంచం. అప్పటికి ఏమయింది. ఈశ్వరుడే ఉన్నాడు వాస్తవంగా. ఆయన ప్రకృతీ ఆయనకు వేరుగాదు. తజ్జన్యమైన ప్రపంచమూ వేరుగాదు. అద్వైతభావం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.

  అలాంటప్పుడీ భూత భౌతిక పదార్ధాలన్నీ ఏమిటి. ఎందుకిలా కనిపిస్తున్నాయి. దీనికింతకు ముందే ఇచ్చాము సమాధాన మిదంతా కేవల మా భాసేనని. ఆభాస దానిపాటికది లేకున్నా వస్తువు నాధారం చేసుకొనే అలా భాసిస్తుంటుంది. వస్తువిక్కడ ఏదో గాదు. నిమిత్తోపాదానాలు రెండూ తానే అయిన ఈశ్వర చైతన్యమే. అదే ఈ జగత్తు కంతటికీ ఆధారం. మయి సర్వమిదం ప్రోతం. నా చైతన్యంలోనే ఈ సమస్తమూ ఓత ప్రోతమయి ఉంది. ఎలా ఉందంటే సూత్రేమణి గణా ఇవ. ఒక దారంలో గ్రుచ్చిన పూసలలాగా నంటున్నది గీత. దారమనే ఆధారం లేకుంటే పూసలు చెల్లా చెదరయి పోతాయి. అలాగే ఈశ్వర చైతన్యమనే అధిష్ఠానం లేకపోతే విరిసిపోతాయీ బ్రహ్మాండ భాండాలన్నీ. నిలవవు. అప్పటికీ తృప్తి లేదు

Page 29

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు