ఘటంలోకి వచ్చి కూచోవలసిందే తప్పదు. రెండూ ఇలా అభిన్నమైన కారణాలు గనుకనే ఏత ద్యోనీని అహం కృత్స్న స్య నా ప్రకృతీ కారణమే నేనూ కారణమే నని చాటుతున్నాడు భగవానుడు.
ఇప్పు డర్ధ మవుతుందొక రహస్యం మనకు. చేతనాచేతన పదార్ధా లేవైనా పరిశీలించి చూడు నీవు. ఉపాదానమైన సత్తూ కనపడుతుంది. నిమిత్తమైన చిత్తూ కనపడుతుం దందులో. ప్రతి ఒక్కటీ అస్తిభాతి. ఉంది స్ఫురిస్తున్నదని గదా నీ అనుభవం. అందులో ఉండటమనేది Existance ప్రకృతి భాగమైతే ఉందనే స్ఫురణ Counciousness ఈశ్వర భాగం. రెండూ మరలా అవినాభూతం Inseperable కనుక ఏకమే. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. సత్తా లేని స్ఫూర్తి లేదు. స్ఫూర్తి లేని సత్తా లేదు. ఉపాదాన నిమిత్తాలు రెండూ అవిభక్తంగా వచ్చి కార్యజగత్తులో ప్రవేశించటం మూలంగానే ఈ అద్వైతానుభవం మనకు.
మత్తః పరతరం నాన్య- త్కించి దస్తి ధనం జయ
మయి సర్వమిదం ప్రోతం - సూత్రే మణి గణా ఇవ - 7
కనుకనే మత్తః పరతరం నాన్యత్ కించి దస్తి - నాకంటే వేరుగా మరేదీ లేదు. ఏ కొంచెమూ లేదని చాటుతున్నాడు పరమాత్మ. వేరుగా లేదంటే ఏదది. ఎందుకు లేదు. అన్యత్కారణాం తరం న విద్యతే. మరొక కారణమేదీ లేదని అర్ధం చెబుతారు భగవత్పాదులు. అంటే ఉపాదానమూ నిమిత్తమూ రెండూ పరమాత్మే కాబట్టి నిమిత్తానికి భిన్నంగా ఉపాదానం లేదని భాష్యకారుల ఉద్దేశం. అది నిజమే. ప్రకృతి ఈశ్వరుడికి అతిరిక్తంగా
Page 28