#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

పాదానాలు రెండు కారణాలూ చూపాలి నీవు. ఉపాదాన మెప్పుడూ అచేతనం. నిమిత్తం చేతనం. నిమిత్తం చేతనం గనుక సృష్టి చేయాలని సంకల్పిస్తుంది. పోతే ఉపాదాన మచేతనం గనుక సృష్టి అవుతుంది. ఈశ్వరు డిప్పుడు చేతనుడు గనుక ప్రపంచ సృష్టికి సంకల్పించాడు గనుక ఆయన దీనికి నిమిత్త కారణం. అచేతనమైన ప్రకృతి అనేది మట్టి లాగా ఆయనకు సామగ్రి అయి కూచుంది గనుక దాన్ని ప్రపంచంగా మలిచి ఇలా తయారు చేసి చూపాడు. అందుకే ఆయన సంకల్ప మమలు పరచటానికి ప్రకృతి ద్వార మయిందని పేర్కొన్నారు భాష్యకారులు.

  అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మముంది. లోకంలో అయితే నిమిత్తోపాదానాలు వేర్వేరుగా కనిపిస్తుంటాయి మనకు. కుమ్మరే మట్టి గాదు. మట్టే కుమ్మరి గాదు. కుమ్మరి మట్టిని వాడుకొంటా డంత మాత్రమే. ఇక్కడ అలా కాదు. కుమ్మరే మట్టి - మట్టే కుమ్మరి. అంటే నిమిత్తో పాదానాలు రెండూ వేరుగావు. ఒకే ఒక తత్త్వం. ఎందుకని. కుమ్మరీ మట్టి లాగా సాకారం కావివి. పరిమితం కావు. ఈశ్వరుడంటే చైతన్యమే గదా. చైతన్యం నిరాకారం. ప్రకృతి అంటే ఆయన శక్తి గదా. శక్తీ నిరాకారమే. రెండూ నిరాకారం గనుక రెండూ కలిసి ఒకటే. అందులో చైతన్యం సృష్టి చేయాలని ఆలోచిస్తుంది. అచేతనాంశ సృష్టి అయిపోతుంది. లోకంలో అయితే రెండూ వేరు కాబట్టి ఉపాదానమైన మట్టి ఘటంలోకి వస్తుంది. నిమిత్తమైన కుమ్మరి బయటనే ఉంటాడు. ఇక్కడ పరమార్ధంలో రెండూ ఒకటయ్యే సరికి ప్రకృతితో పాటు ఈశ్వరుడు కూడా ప్రపంచమనే

Page 27

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు