#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

నేనేనంటాడు. ఇది చాలా విడ్డూరంగా ఉందీమాట. ఎందుకంటే ఇంతకు ముందుగానే చెప్పాడు ప్రకృతే సృష్టించిందీ ప్రపంచాన్నని. ఇప్పుడేమో తానే సృష్టించా నంటున్నాడు. ఇంతకూ ప్రకృతి సృష్టించిందా - పరమాత్మ సృష్టించాడా. ఎవరని అర్థం చేసుకోవాలి మనం. రెండూ పరస్పర విరుద్ధంగా లేవా మాటలు. ఏ మాట నమ్మాలి మనమని ప్రశ్న వస్తున్నది.

  దీన్ని ఎలా సమన్వయించు కోవాలని అడిగితే భగవత్పాదు లొక్క మాట వ్రాసి ఊరకున్నారు. అదేమిటంటే ప్రకృతి ద్వయద్వారేణ అహం సర్వజ్ఞః ఈశ్వరః జగతః కారణ మిత్యర్థః - ఇదీ ఆయన మాట. పరమాత్మే సగుణమైతే ఈశ్వరుడు. అప్పుడాయన కర్త అవుతాడు. ఆ కర్తృత్వం పెట్టుకొని సృష్టిస్తున్నాడు ప్రపంచాన్ని. మరి ప్రకృతో. అది సృష్టికి కేవలం ద్వారం మాత్రమే. ఒకటి ద్వారం. మరొకటి ఆ ద్వారం నుంచి బయటపడే సంకల్పం. రెండూ కలిస్తే సృష్టి.

  ఇది బాగా అర్ధం కావాలంటే అసలొక ముఖ్యమైన సృష్టి రహస్యం తెలియాలి ప్రతి ఒక్కరికీ. అదేమంటే కారణం Cause లేకుండా కార్యమనేది జరగ దెప్పుడూ. సృష్టి అనేది కార్యం Effect. దానికి కారణ మొకటి ఉండి తీరాలి. ఒకటి గాదది. రెండు. ఒక కుండ తయారు కావాలంటే కుమ్మరి మట్టి రెండూ ఉండాలి. కుమ్మరి ఉండి మట్టి లేకున్నా - మట్టి ఉండి కుమ్మరి లేకున్నా ఫలితం లేదు. రెండూ ఉండి తీరాలి. అందులో కుమ్మరి నిమిత్త కారణం. మట్టి ఉపాదాన కారణమని పేర్కొంటారు వేదాంతులు. అలాగే ప్రస్తుత మీ బ్రహ్మాండ భాండాలన్నీ తయారు కావాలంటే నిమిత్తో

Page 26

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు