#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

దీనికి. కాబట్టి ప్రకృష్టమయి కూడా నికృష్టమయి కూచుంది. ఇందులో కూడా సమష్టి జీవుడైన హిరణ్యగర్భుడి ప్రకృతి శుద్ధ సత్త్వోపాధి గనుక కొంత ప్రకృష్టమనే చెప్పవచ్చు.

  మొత్తం మీద రెండూ ప్రకృతులే. ప్రకర్షణ కరోతీతి ప్రకృతిః అన్నారు. లెక్కకు మిక్కిలిగా సృష్టిస్తూ పోయేదేదో అది ప్రకృతి. ఏతద్యోనీని భూతాని సర్వాణి. చరాచర పదార్ధాలన్నీ ఈ ప్రకృతి ద్వయం వల్ల ఏర్పడ్డవే. ఉపధారయ - అదీ నీవు తెలుసు కోవలసిన విషయం. కేవలమొక ప్రకృతే కాదు కర్త. రెండూ కలిసి కర్తృత్వం వహిస్తాయి. కేవల మపరే అయితే శరీరాదులైన ఉపాధులే ఏర్పడుతాయి. అవి జడ పదార్ధాలు మాత్రమే. ఆస్తిపాస్తుల లాంటివవి. మరి ఆస్తి నను భవించే కామందు ఒక డుండాలి గదా. వాడు లేకుండా అనుభవ మెవడికి. కాబట్టి ఉపాధులు నావే నేనేనని అభిమానించే చేతనం కూడా ప్రవేశించాలి ఉపాధులలో. వాడే జీవుడు లేదా సమష్టి జీవుడైన హిరణ్యగర్భుడు. ఇలా అవి రెండూ కలిసి బ్రతికితే అప్పుడీ సంసార యాత్ర నిరాటంకంగా సాగిపోతుంది. ఇదీ విషయం. అందుకే ఏత ద్యోనీని అన్నాడు. రెండు ప్రకృతులూ కలిసి ఈ భౌతిక ప్రపంచానికి యోని. జన్మకారణం.

  అంతేకాదు. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తథా. ఇంకా ఒక భయంకరమైన ప్రకటన చేస్తున్నాడు పరమాత్మ. ఏమని. నేనే ఈ సమస్త ప్రపంచానికీ ప్రభవః జన్మ స్థానమూ. ప్రలయః లయ స్థానమూ. భూత భౌతిక పదార్ధాలన్నింటినీ సృష్టించింది నేనే. వీటిని లయం చేస్తున్నదీ

Page 25

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు