#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

ప్రాణమనేది ధరించి బ్రతుకుతున్న జీవుడే పరా ప్రకృతి. అది మొదట బ్రహ్మాండమనే శరీరంలో వచ్చి ప్రవేశించింది. దానికే అంతర్యామి ఈశ్వరుడూ అని పేరు. అదే మరలా పిండాండమైన మన శరీరాలలో వచ్చి కూచొని ఇక్కడా బ్రతుకుతున్నది - దీనికే జీవుడని పేరు. ఇందులో సమష్టి వ్యష్టి రూపాలుగా ఉన్న శరీరాలు రెండూ అచేతనాలు కాబట్టి ఉపాధులు Forms or Media. వాటిలో వచ్చి కూచున్నదలా అచేతనం కాదు. చేతనం Conscience. కనుక ఇవి రెండూ ఒకటి ఈశ్వరుడు మరొకటి జీవుడు. వీరు ఆ శరీరాలను ధరించి ఉంటే అవి వీరి చేత ధరింప 'బడుతున్నాయి. యయేదం ధార్యతే జగత్. బ్రహ్మాండ శరీరాన్ని ధరించిందొకటైతే పిండాండ శరీరాన్ని ధరించిందొకటి.

ఏత ద్యోనీని భూతాని - సర్వాణీ త్యుపధారయ
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తధా - 6


  కాగా ఈ రెండు పరాపర ప్రకృతులలో అపర సంసార బంధానికి దారి తీస్తుంది కాబట్టి నికృష్ట మైనది. పర మరలా సాయుజ్యాన్ని ఎప్పటికైనా మన కందిస్తుంది కాబట్టి ప్రకృష్ట మైనది. కారణం. అపర అచేతనం. పర చేతనం. పరమాత్మకు అపర విజాతీయమైతే పర సజాతీయం. చేతనం చేతన మొక జాతిగదా. అందుకే పరే పరమాత్మ భావాన్ని చేరుస్తుందెప్పటికైనా. అయితే ఎంత చేతనమైనా ఇది అచేతనమైన దేహేంద్రియాదులతో చేయి కలిపి కలుషితమూ పరిచ్ఛిన్నమూ అయిపోయింది కాబట్టి గుణమున్నా quality పరిమాణం quantity లేదు

Page 24

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు