#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

చేయటానికి సమర్ధమది. కర్తృత్వం దానిదే. జీవుడిది గాదు. జీవుడు భోక్త మాత్రమే. అది సుఖదుఃఖాలు తెచ్చి నెత్తిన పడేస్తే అనుభవించే బాపతే వీడు. దాని నుంచి తప్పించుకోటమే తప్ప దాన్ని తనలో లయం చేసుకొనే మార్గం చెప్పరు. చెప్పలేరు సాంఖ్యులూ యోగులూ. పోతే వేదాంతులు చెప్పే ప్రకృతి వేరు. ఇది ఈశ్వరుడి మాయా శక్తి. శక్తి మాయ ప్రకృతి - అక్షరం - అవ్యక్తం ఇలా ఎన్నో పేర్లున్నాయి దీనికి. ఇది స్వతంత్ర కాదు. ఈశ్వరుడి కధీనమైనది. ఆయన శక్తే కనుక ఆయన కధీనం కాక తప్పదు. అందుకే మే - మమ - నాది నాది అని పేర్కొంటాడు దాన్ని భగవానుడు. అంతేకాదు. ఆయన శక్తి అని ఎప్పుడన్నామో ఆయన కన్నా అది వేరుగాదు. శక్తి శక్తిమతో రభేదః - ఆయన స్వభావమది. స్వోభావః - స్వభావః - తన భావమే తన స్వరూపమే అది. తాదాత్మ్య సంబంధ Total Identity మిద్దరికీ. ఈశ్వరుడే ఆయన శక్తి. ఆయన శక్తే ఆయన. ఇదీ ఇక్కడ ఉన్న విషయం.

  ఇప్పుడీ ఈశ్వర శక్తి లేదా ప్రకృతి అనేది రెండు విధాలు. ఒకటి అపర - మరొకటి పర. సంసార బంధానికి దారి తీస్తుంది కనుక అపర అయింది. మరలా అందులో నుంచి ఎప్పటికైనా ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి పర అయింది. ఇందులో ఇంతవరకూ అపరను గూర్చి చెబుతూ వచ్చింది గీత. అదే పృథివ్యాదులైన అష్టమూర్తులు. పోతే ఇప్పుడు రెండవదైన పరా ప్రకృతిని వర్ణిస్తున్నాడు. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం. ఏమిటా పర అంటే జీవభూతాం. శరీరంలో వచ్చి కూచొని

Page 23

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు