ఉంటుంది. అంటే అప్పటికి నిన్ను చూస్తునానని చెప్పినా అతడాయనను విభూతిగానే చూస్తున్నాడు గాని స్వరూపంగా చూడటం లేదు. విశ్వరూపమే దర్శన మిస్తున్నది. విశ్వేశ్వరుడు కాదు. అది ఆత్మ స్వరూపమే గనుక అర్జునుడికి విషయంగా గోచరించదు. ఎలా చూస్తాడు పాపం. కనుకనే విశ్వరూప విశిష్టంగా విశ్వేశ్వరుణ్ణి పట్టుకొని నిన్ను చూస్తున్నానంటున్నాడే గాని తద్రహితంగా నిరుపాధికమైన విశ్వేశ్వర తత్త్వాన్ని చూచి అనటం లేదా మాట.
కితేటినం గదివం చక్రిణంచ
తేజో రాశిం సర్వతో దీప్తి మంతం
పశ్యామి త్వాం దుర్ని రీక్ష్యం సమంతాత్
దీస్తాన లార్క ద్యుతి మప్రమేయమ్ - 17
చూచారా. ఇక్కడ బయటపడుతున్నా డర్జునుడు మళ్లీ. కిరీటినం గదినం - కిరీటమూ గదా చక్రం ఇలాటి దివ్యాయుధా లన్నీ ధరించిన నీ రూపాన్ని నేను చూస్తున్నా నంటున్నాడు. కాదు కాదు. పశ్యామిత్వాం నిన్నే చూస్తున్నానంటాడు. రూపానికీ రూపధారి అయిన పరమాత్మకూ తేడా చూడలేక పోతున్నాడతడు. వ్యక్తమైన రూపమే అవ్యక్తమైన భగవత్తత్త్వ మవుతుందా. రూపాలనేకం. తత్త్వమేకం. రూపాలు వస్తూపోతుంటాయి. తత్త్వమలా వచ్చేది పోయేది కాదు. అది సహజం. శాశ్వతం. అయినా చూస్తున్నాడు గదా అంటే ఏమి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడా తత్త్వాన్ని.
Page 403