కనిపిస్తున్నా యతనికి. పశ్యామిత్వా సర్వతోనంత రూపం. అనంతంగా వ్యాపించిన రూపాన్ని కూడా చూస్తున్నానంటాడు. అయితే ఆ రూపాని కాదీ మధ్యం అంతమనేది మాత్రం నాకంతు పట్టటం లేదని వాపోతాడు. ఏమి కారణం. నీవు విశ్వేశ్వరుడివి. నీవు చూపేది విశ్వరూపం.
ఇప్పుడొక ప్రశ్న. అర్జునుడాయన శరీరాన్ని చూడటం లేదు. ఆయన స్వరూపాన్ని చూడటం లేదు. అతడు చూస్తున్నదంతా కేవల మాయన వ్యక్తమైన రూపాన్నే అని గదా మనమింత వరకూ విమర్శిస్తూ వచ్చాము. కాని ఇప్పుడర్జునుడాయన బాహ్యమైన రూపాన్నే గాక ఆయనను కూడా చూస్తున్నా నంటున్నాడే. ఏమిటర్ధం. పశ్యామి దేహే తవ అని గాక పశ్యామిత్వా. నీదేహంలో అవీ ఇవీ అనే గాక నిన్ను కూడా చూస్తున్నా నంటున్నాడు. ఆ నీవనే మాట కర్థం పరమాత్మ స్వరూపమని కాదా. కాదు. ఎందుకంటే అనేక బాహూదర వక్త్రనేత్రమని ఆయన ఉపాధిని వర్ణించి మరలా అనంత రూపం. దాని కంతం లేదంటున్నాడు. అంతేగాక ఇంకా ఒకమాట అంటున్నాడు. ఏమని. నాంతం నమధ్యం నపునస్త వాదిం. నీ ఆది మధ్యాంతాలేవీ నాకు కనపడటం లేదంటాడు. అంటే ఆయన స్వరూప మున్నదున్నట్టు చూడలేకపోతున్నాడు. అది అతని దృష్టి కందేది కాదు. దృష్టి అది. దృశ్యం కాదు. బాహూదర వక్తాదులైతే దృశ్యం. ఎలాగైనా చూడవచ్చు. దృగ్దృశ్యాలు రెండూ పరమాత్మ రూపాలే అయినా దృక్కు అవ్యక్తం. కనపడేది కాదు. మరి దృశ్యమో వ్యక్తమది. ఎప్పుడూ కనపడుతూనే
Page 402