విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
సంఘాన్ – బ్రహ్మాణం - ఈశం - బుషీన్ ఉరగాన్ - చేతన మ చేతనమని తేడా లేదు. స్వర్గ మర్త్య పాతాళాలని ప్రశ్నలేదు. దేవత లేమిటి. మిగతా జీవ బాలమేమిటి. ఆఖరుకు సత్యలోక వాసి బ్రహ్మదేవుడేమిటి - మహర్షు లేమిటి - నాగదేవత లేమిటి అన్నీ కనిపిస్తుంటే చూస్తున్నాడవన్నీ అర్జునుడు. అలా మౌనంగా చూడటమే గాక తాను చూస్తున్నదంతా ఏకరువు పెడుతున్నాడు కూడా. ఇంతకూ దేవాది దేవుడైన పరమాత్మ రూపాన్నే గాక ఆయా దేవతా మూర్తులను కూడా దర్శిస్తున్నాడు. త్రిలోకవాసులూ దర్శన మిస్తున్నా రతనికి. ఇస్తుంటే వారి బాహ్యమైన రూపాలనే చూస్తున్నాడు. ఆంతరమైన తత్త్వాన్ని దర్శించటం లేదు. దేవదేవుడైనా అంతే. దేవతలైనా అంతే. కాని చిత్రమేమంటే ఆయా లోకవాసు లందరినీ వారి వారి లోకాలలో వారి వారి శరీరాలలో గాక ఒకే ఒక పరమాత్మ శరీరంలో అనంతంగా విస్తరించిన శరీరంలో అందరినీ కలిపి ఒకేచోట దర్శించటమే ఇక్కడ జరుగుతున్న పని. అదే గొప్ప ఆశ్చర్యం.
అనేక బాహూ దర వక్త్ర నేత్రం
పశ్యామి త్వా సర్వతో నంత రూపం
నాంతం నమధ్యం న పున స్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప - 16
అంతే కాదు. ఇలా వారినీ వీరినీ వర్ణిస్తూ వర్ణిస్తూ మరలా దేవాది దేవుడైన భగవానుడి దగ్గరికే వచ్చి మాటాడుతున్నాడు. ఏమని. అనేక బాహూదర వక్త్రనేత్రం. అనంతమైన బాహువులూ ముఖాలూ నేత్రాలూ
Page 401