దివ్య స్వరూపాన్ని. తతస్స విస్మయా విష్టో హృష్ట రోమా. చూచాడో లేదో శరీరం గగుర్పొడిచింది. ఆశ్చర్యంతో ప్రణమ్య శిరసా. అప్రయత్నంగా శిరసు వంచి ప్రణామం చేస్తూ అభాషత. ఇలా వర్ణించసాగాడు.
ఏమిటిదంతా. ఇంతకూ అర్జునుడేమి చూచాడని. స్వామివారి శరీరాన్ని చూచాడా. శరీరం తాలూకు ముఖనేత్ర శ్రోత్రాది ఇంద్రియాలు చూచాడా. దానిమీద ఉన్న వస్త్రాలంకారాదులు చూచాడా. లేక అసలు స్వామివారి స్వరూపాన్నే చూచి మాటాడుతున్నాడా. శరీరే అనటం వల్ల శరీరాన్ని కాదతడు చూచింది. అనేక వక్త్రనయనమని అనేక దివ్యాభరణ మన్నందువల్ల శరీరగతమైన కలాపాన్నే చూచాడు. మహా అయితే సమస్త ప్రపంచాన్నీ ఏకంలో అనేకంగా విభక్తమయినట్టు చూచాడే గాని ఆ పరమైన తత్త్వమేదో దాన్ని చూచినట్టెక్కడా లేదు. అంటే ఈ సర్వానికీ అధిష్ఠాన మేదో ఆ విశ్వేశ్వర చైతన్యాన్ని చూడటం లేదతడు. ఆ విశ్వేశ్వరుడు ప్రదర్శించే విశ్వరూపమనే గారడీనే దర్శిస్తున్నాడన్న మాట.
పశ్యామి దేవాం స్తవ దేవ దేహే -
సర్వాం స్తథా భూత విశేష సంఘాన్
బ్రహ్మాణ మీశం కమలాస న స్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ - 15
జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకధా. విశ్వాన్నే అనేక విధాలుగా ప్రవిభక్త మయినట్టు చూచాడన్నారే ఏమిటా ప్రవిభక్తమని ప్రశ్న వస్తే చెబుతున్నాడు. ఆయన రూపమే గాదు విశ్వం. దేవాన్- భూత విశేష
Page 400