చూచినా ఏమున్నది. చూస్తూ చూస్తుండగానే మటుమాయ మవుతుందని మరలా సూచించటానికే హరి అనే మాట ప్రయోగించాడు మహర్షి. హరతీతి హరిః ఎవడు హరిస్తాడో వాడు హరి. ఎంత నీవుబలాట పడి చూచినా ఆయన చూపినా ఇది నిలిచేదిగా దీ విశ్వరూపం. రూపాన్నే చూస్తున్నావు గాని దానికి మూలమైన స్వరూపాన్ని చూడటం లేదు. కనుక దీని కస్తిత్వం లేదు. మధ్యలోనే మాసిపోతుంది సుమా. బెంబేలు పడతావు. కనుక ఆత్మ దృష్టి పెట్టుకొని అనాత్మ జగత్తును చూస్తూపో. అప్పుడనాత్మ మాసిపోయినా ఆత్మ నీకు దక్కుతుంది. అనాత్మ కూడా ఎక్కడికో పోదు. ఏమో అయిపోదు. ఆత్మలోనే చేరిపోయి అఖండమైన ఆత్మగానే నీకు దర్శనమిస్తుంది. ఇంతకూ అహమని విషయిని ఎక్కడా ప్రస్తావించ కుండా ఇదం పశ్య అని విషయ ప్రపంచాన్నే మాటి మాటికీ వర్ణిస్తూ పోవటంలో పరమాత్మ అభిప్రాయమిది. పరమాత్మ దని మనకు బోధించే వ్యాస భగవానుడి తాత్పర్యమిది.
అనేక వక్త్ర నయన - మనేకాద్భుత దర్శనం
అనేక దివ్యాభరణం దివ్యానే కొద్యతాయుధమ్ - 10
దివ్య మాల్యాంబర ధరం - దివ్య గంధాను లేపనం
సర్వాశ్చర్య మయం దేవ మనంతం విశ్వతో ముఖమ్ - 11
దివి సూర్య సహస్ర స్య - భవేద్యుగప దుస్థితా
యదిభా స్సదృశీ సాస్యా - ద్భాస స్తస్య మహాత్మనః - 12
తత్రైకస్థం జగత్కృత్స్నం - ప్రవిభక్త మనే కధా
అపశ్య ద్దేవ దేవస్య - శరీరే పాండవ స్తదా - 13
Page 398