దర్శించినా అది సమగ్రమైన దృష్టి కాదు. అలా కాదనే సత్యాన్ని సూచించటానికే పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ పశ్యమే యోగమైశ్వరమని దీన్ని చూడమంటాడే గాని దీన్ని చూపే నన్ను చూడమని ఎక్కడా అనడు. అయితే నేను లేకుండా ఇది లేదని గుర్తుంచుకోమని వ్యంగ్యంగా బోధిస్తాడు. ఇదమనేది చూస్తూ అహమనే ఆత్మను మరచిపోతున్నావు నీవు. అహమే ఇదంతా రూపంగా కనిపిస్తున్నదని ఇంతకు ముందు విభూతి యోగంలో చివరదాకా వర్ణిస్తూనే వచ్చాడు గదా. ఆదిత్యానా మహం విష్ణుః అంటే ఏమిటర్థం. మూడు మాటలున్నా యక్కడ. ఆదిత్య అనేది ఇదమనే దృశ్య ప్రపంచంలో సామాన్య వాచకం. విష్ణుః అనేది అందులోనే ఒక విశేషం. పోతే ఇవి రెండూ నా విశ్వరూపమే. దీన్ని అహంగా చూచినప్పుడే జ్ఞానం. అలా చూడనంత వరకూ అది దాని ఆభాసే వస్తువు కాదని హెచ్చరించటానికే అక్కడ పరమాత్మ సర్వత్రా అహమనే మాటా అస్మి అనే మాటా విడవకుండా ప్రయోగిస్తూ వచ్చాడు. ఎందుకు. మన దృష్టి ఇదం వరకే ఆగిపోకుండా దాని కధిష్ఠానమైన అహమనే ఆత్మ మీదికి మళ్లించటానికి.
పోతే ఇది బాగా అర్జునుడికి ఒంట బట్టిందో లేదోనని పరీక్షించటానికో ఏమో ఇక్కడ అహమనే మాట వాడకుండా ఇది చూడు ఇది చూడు అని ఇదం రూపమైన విశ్వం మాత్రమే చూపుతున్నాడు. ఇదే పెద్ద మోసం. అహంతో ముడిపెట్టుకోకుండా ఇద మనే దాన్ని ఎంత
Page 397