#


Index

విశ్వరూప సందర్శన యోగము

చెబుతున్నాడు సంజయుడు. మంచిదే. మహాయోగీశ్వరు డేమిటి. హరి ఏమిటి. పరమం యోగమేమిటి. యోగ విభూతిని చూపాలంటే యోగాని కీశ్వరుడయి ఉండాలి. మహా విభూతినే చూపాలంటే మహాయోగీశ్వరుడే అయి ఉండాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మామూలుగా కనిపించే కృష్ణ విగ్రహం కాదు. అది వ్యక్తమయిన మూర్తి. దాన్ని దాటిపోతే గాని మహాయోగీశ్వరుడు కాలేడు. అప్పుడది కంటికి కనిపించే విగ్రహం గాదు. అశరీరమైన చిదాకాశ స్వరూపం. సర్వతో గతం. అలాంటి రూపం కాని రూపం ధరించా డిప్పుడు కృష్ణుడు. కనుక ఇక కృష్ణుడు కృష్ణుడుగా కనపడ డర్జునుడికి.

  అయితే ఏమి కనిపిస్తున్నదిప్పు డర్జునుడికి. కృష్ణుడు కాదు. కృష్ణ పరమాత్మ చూపే యోగ విభూతి మాత్రమే కనిపిస్తుంది. అది కూడా ఇంతకు పూర్వం తన కలవాటయిన ప్రపంచం కాదు. లోకోత్తరమైన అదృష్ట పూర్వమైన మరో ప్రపంచం. పర వాసుదేవుడు చూపేది పరమం గాక అపరమెలా అవుతుంది. అయినా దృశ్యంగా కనిపిస్తున్నది కాబట్టి అందులోనూ దివ్యమైన దృష్టి ఇచ్చాడు కాబట్టి కొంత కష్టపడి అయినా చూడగలడేమో. కాని దాన్ని ఎవడు చూపుతున్నాడో వాణ్ణి మాత్రం చూడలేడు. అంటే ఆత్మను చూడలేడు అనాత్మ ప్రపంచాన్ని మాత్రమే చూడగలడే మానవుడైనా. ఇప్పుడే మన ఆత్మను మనం చూడలేము. మనం చూడగలిగినదంతా అనాత్మే. ఆత్మను దర్శించకుండా అనాత్మనెంత

Page 396

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు