విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ - అని అధ్యాయం చివరలో కుండబద్దలు గొట్టి అసలు గుట్టంతా బయటపెట్టాడు. ఏమిటర్ధం దానికి. నీవెంత ఉబలాటపడ్డా ఆ ఉబలాటం తీర్చేందుకు నేవెంత సినిమా చూపినట్టు నీకు చూపినా అది వాస్తవంగా నన్ను చూడటం కాదు సుమా. నన్నూ నా విభూతినీ కలిపి పట్టుకోవాలంటే నేను ప్రసాదించేది కాదది. నీకు బ్రహ్మాండమైన ప్రయత్న ముండాలి. అదేదో గాదు. అనన్యమైన భక్తి. స్వరూపాని కన్యంగా ఏదీ లేదను కొని దాన్ని మాత్రమే అంటి పట్టుకోటమే అనన్య భక్తి. అలాటి అనన్య భక్తి ఒకరిచ్చేది గాదు. స్వప్రయత్నంతో నీ వభ్యసించవలసినది. దాని బలంతోనే నన్ను తెలుసుకోటానికి గాని చూడటానికి గాని తుదకు నాలో ప్రవేశించి నాతో ఏకం గావటానికి గాని నీబోటి జీవులకు సాధ్యమవుతుంది. మరొక విధంగా ఏ లఘు మార్గమూ Short route లేదు మోక్షానికని భగవానుడి మందలింపిది. అర్జునుడికే గాదు. తదప దేశంగా సమస్త సాధక లోకానికీ.
ఏవముక్త్వా తతో రాజన్ - మహా యోగేశ్వరో హరిః
దర్శయామాస పార్ధాయ - పరమం యోగ మైశ్వరమ్ - 9
ఏవ ముక్త్వా తతః ఈ విధంగా అర్జునుణ్ణి సంబోధించి మహాయోగీ శ్వరో హరిః - మహాయోగీశ్వరుడైన ఆ హరి దర్శయ మాస పార్థాయ. అర్జునుడికి చూపాడు. ఏమిటి. పరమం యోగమైశ్వరం. ఈశ్వరీయమైన తన మహాప్రభావాన్ని. అనగా విశ్వరూపాన్ని. అని ధృతరాష్ట్రుడికి
Page 395