#


Index

విశ్వరూప సందర్శన యోగము

మవుతూ పోతే ఆ మేరకది భగవదనుగ్రహంగా భావించాలి మనం. అసలు మనమెవరం. మన సంకల్పమేమిటి. మన ప్రయత్నమేమిటి. తత్ఫలాను భవమేమిటి. అంతా ఒక విధంగా చూస్తే భగవత్స్వరూపమే గదా. భగవత్తత్త్వ మన్నింటికీ అధిష్ఠాన మన్నప్పుడు దాని స్పర్శ లేకుండా ఏది ఉన్నది.

  మరి అర్జునుడికి దివ్య దృష్టి నిచ్చాడనే మాట కర్థమేమిటి. విశ్వరూపాన్ని చూడటానికే గాని అది విశ్వేశ్వరుణ్ణి చూడటానికి గాదు. విశ్వేశ్వరుణ్ణి చూడనంత వరకూ విశ్వాన్ని చూచినా ఒకటే. చూడకున్నా ఒకటే. అది నిష్ప్రయోజనం. రెండందాలా నష్టమే అది మానవుడికి. ఎలాగంటే అధిష్ఠానమా కనపడటం లేదు. ఆరోపితమా కనపడి ఉపయోగం లేదు. భగవత్పాదులు చెప్పినట్టు దృష్ట నష్ట స్వభావమది. చూస్తున్నామనే గాని కనిపించినట్టే కనిపించి అసలే కనుమరుగయి పోతుంది. అలాగేగా విశ్వరూపం తాత్కలికంగా కనిపించి మరలా మాయమయి పోయింది చివరకు. కాబట్టి అర్జునుడి కిదుగో నీకొక దివ్యదృష్టి ఇస్తున్నాను. దీనితో నీవు చూడు నేను కనపడతానని చెప్పినా అది వట్టి మాట. నా రూపం చూస్తానని చెప్పాడే గాని నా తత్త్వాన్ని చూడగలవని చెప్పలేదు. తత్త్వాన్ని చూడకుండా రూపాన్ని చూచి ఏమి సుఖమది కేవలం నీ చాపల్యమేనని భంగ్యంతరంగా అతణ్ణి ఎత్తి పొడవటమే ఇది. మరేమీ గాదు. అందుకే ఈ రహస్యాన్ని సూచించటానికే భక్త్యాత్వ నన్యయా శక్యః అహ మేవం

Page 394

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు