చూచినా దానితో ముడిపెట్టి చూడలేడు. చూడకుంటే ఇది మాయా మయమని తెలియక ఇదే యధార్ధమని భ్రమపడతాడు. అందుకే నీ చర్మచక్షువులతో చూడలేవా రూపాన్ని. దివ్యం దదామితే చక్షుః - దివ్యమైన అప్రాకృతమైన దృష్టి నీ కిస్తాను. ఆ అద్దాలు పెట్టుకొని చూడు నీ కర్ధ మవుతుందంటాడు. ఏమిటది. యోగ మైశ్వరం. ఈశ్వరుడనైన నాకు సంబంధించిన యోగం. అంటే ఐశ్వర్యం లేదా విభూతి అని అర్థం.
ఇక్కడ ఒక తిరకాసుంది ఈ మాటలో. దివ్యమైన దృష్టి భగవాను డివ్వాలా మానవుడికి. అలా ఇచ్చేట్టయితే ఒక అర్జునుడికే నేమి. లోకులందరికీ ఇవ్వవచ్చుగదా. అందరూ ఆయనకు సమానమే గదా ఆ మాటకు వస్తే. అంతే కాదు. మరొక విషయమే మంటే స్వప్రయత్నం లేకుండా భగవత్ప్ర పాదలభ్యమే అయితే ఇక వేదాంత శ్రవణాదులు దేనికి. గురూపదేశం దేనికి. శ్రోతవ్యో మంతవ్య అని శాస్త్రం మనకు కర్తవ్యాన్ని విధించవలసిన అవసరం దేనికి. కరుణాళుడైన పరమేశ్వరుడు తన శక్తి ప్రభావంతో పరమ పురుషార్ధమైన మోక్ష ముచితంగా నలుగురికీ ప్రసాదించవచ్చు గదా.
నిజమే. అలాగే భగవానుడు ప్రతి ఒక్కటీ మన కందించే ట్టయితే మనకు స్వర్గా పవర్గాలు రెండూ అప్రయత్నంగానే సిద్ధిస్తాయి. సందేహం లేదు. కాని అలా ఎన్నటికీ జరగదు. భగవదనుగ్రహ మెంత ఉన్నదో పురుష ప్రయత్నమంతకు మించి ఉండాలి. పురుషుడు ప్రయత్నిస్తేనే ఆయన అనుగ్రహిస్తాడు. ఆ మాటకు వస్తే మన ప్రయత్నమే అంతకంతకు ఫలోన్ముఖ
Page 393