#


Index

విశ్వరూప సందర్శన యోగము

కలిగిస్తుంటుంది మనకు. అది ఉన్నంత వరకూ బ్రహ్మాను భవానికి నోచుకోలేము. లేకుంటే సంసారమనే సమస్యకు బంధానికే అందులో నుంచి బయటపడటానికి గాదు. యశోద చూడలేదా విశ్వరూపం ధృత రాష్ట్రాదులు చూడలేదా పూర్వం. కాని ఏమర్ధమయింది వారికి. ఏమనుభవానికి వచ్చింది. చూడటం లేదు. చూచింది ఎంతవరకర్ధం చేసుకొన్నాడు మానవుడని ప్రశ్న. దానికి జవాబు. ఇదీ ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. అది రెండుమాటల్లో ఎంతగా ధ్వనింప జేస్తున్నాడో చూడండి మహర్షి

నతు మాం శక్ష్యసే ద్రష్టు- మనేనైవ స్వ చక్షుషా
దివ్యం - దదామితే చక్షుః - పశ్యమే యోగ మైశ్వరమ్ - 8


  కాగా అసలు సంగతి ఇప్పుడు బయటపెడుతున్నాడు చూడండి. నతు మాం ద్రక్ష్యసే ద్రష్టు మనే దైవ స్వచక్షుషా - నీవు నీకిప్పుడున్న కండ్లతో నన్ను చూడలేవు. ఇప్పుడు నీకున్న చూపు ప్రాకృతమైనది. అలాగే వ్రాశారు భాష్యకారులు. ప్రకృతి సిద్ధమైన దేదో అది ప్రాకృతం. ప్రకృతి అంటే త్రిగుణాత్మకం. కాబట్టి ఆ దృష్టి కూడా త్రిగుణాత్మకమే. త్రిగుణాల పరిధి దాటి పోలేదు. పోకుంటే దానికి గుణాత్మకమైన విశ్వమే కనపడుతుంది గాని గుణాతీతుడైన విశ్వేశ్వరుడు కనపడడు. విశ్వేశ్వరుడంటే అది ఏకైక తత్త్వం. అదే అధిష్ఠానమీ విశ్వాని కంతటికీ. కాబట్టి గుణాతీతమైన ఆ తత్త్వాన్ని పట్టుకొంటే గాని గుణాత్మకమైన విశ్వాన్ని

Page 392

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు