కృష్ణాది రూపంగా అవతరిస్తాడా పరమాత్మ. అప్పుడది ఒక శరీరం మేరకు పరిమితమయి సర్వులకూ దృగ్గోచరమవు తుంటుంది. ఇలా అవ్యక్తమూ వ్యక్తమూ అయిన రెండు శరీరాలున్నాయి ఆయనకు. ఇప్పుడు మమ దేహే అంటున్నాడంటే ఈ వ్యక్తమైన కృష్ణ శరీరమని గాదు మహర్షి ఉద్దేశించి రచిస్తున్నది. అవ్యక్తమయి అకాశంలాగా సర్వత్రా పరచుకొని ఉన్న ఆ దివ్య శరీరం. శరీరం గాని శరీరం. ఆకాశ శరీరమని శాస్త్రం వర్ణించిన శరీరం. ఉన్నట్టుండి తన మయా బలంతో తనకు సహజమైన ఆ శరీరంగా మారి అందులో చూపుతున్నాడీ సమస్త విశ్వాన్ని కృష్ణ పరమాత్మ. అలా చూపుతుంటే ఆ శరీరం కనిపించటం లేదెవరికీ. అక్కడే ఉన్నా దుర్యోధవాదులకూ భీష్మ ద్రోణాదులకూ గోచరించటం లేదు. ఆ మాటకు వస్తే అర్జునుడికి కూడా ఆ శరీరం కనపడటం లేదు. అవ్యక్తమూ నిరాకారమూ గదా. ఎలా కనిపిస్తుంది. మరి ఆయన శరీరమే కనపడకపోతే ఆ శరీరంలో అర్జునుడు విశ్వరూపాన్ని ఎలా చూచాడు. అతడు చూచినప్పుడు మిగతా యోధ వీరులందరూ అక్కడే ఉన్నారు గదా అతని లాగేవారు మాత్రమెందుకని చూడలేకపోయారు.
దీనికి జవాబొక్కటే. అర్జునుడూ చూడలేడు గనుకనే ఒక దివ్య దృష్టిని ప్రసాదించా డతనికి భగవానుడు. అది ఒక కళ్లజోడు లాంటిది. ప్రత్యేకంగా అతనికి మాత్రమే తయారు చేయించి ఇచ్చాడా వైద్యుడు. అందుకే ఎవరికీ కనపడని విశ్వరూప మతనికే కనిపించటం. ఇది ఎలాంటిదంటే నీకొక
Page 389