#


Index

విశ్వరూప సందర్శన యోగము

విజాతీయ స్వగత భేద రహితమని అర్థం. ఏకమేవా ద్వితీయమని ఉపనిషత్తు పరమాత్మను వర్ణించిందంటే ఇంత ఉన్న దర్ధం. సజాతీయ భేద ముండగూడు దీనికి. అంటే మిగతా శరీరాలేవీ కనపడగూడదు. విజాతీయ భేదం పనికి రాదు. అంటే మానవ శరీరాలే గాక వన నదీ పర్వత సూర్య చంద్ర గ్రహ నక్షత్రాది పదార్ధాలేవీ కనపడరాదు. పోతే స్వగతమంటే దానిలోనే కరచరణాదులూ మనః ప్రాణాదులూ గోచరించరాదు. మరి కృష్ణ శరీరమలా ఉందా ఇప్పుడు. అర్జునాదుల శరీరాలూ పశుపక్ష్యాదుల శరీరాలూ దానికి సజాతీయ భేదం కావలసినంత ఉన్నది. అరణ్యనదీ సముద్రాదులు దానికి విజాతీయ మెంతో ఉన్నది. పోతే ఆ కృష్ణుడి శరీరంలోనే కరచరణాది భేదం కనిపిస్తున్నది. కాబట్టి మూడు మూరల జానెడు మేరకు పరిమిత మైన కృష్ణుడి శరీరంలో సమస్త ప్రపంచమూ ఆయన చూపటమేమిటి. అర్జునుడది చూడటమేమిటి. అసంభవం.

  అయితే మమ దేహే అని ఎలా అన్నాడు కృష్ణ భగవానుడు. భగవానుడు గనుకనే అన్నాడు. మాయాశక్తి వశమైన వాడెవడో వాడు భగవానుడు. మాయను తనలో ఏకం చేసుకొని తాను తానుగా ఉన్నంత వరకూ ఒక శరీరమంటూ లేదాయనకు. శరీరం గాని శరీముంటుంది. అది సచ్చిద్రూపం. అంటే సర్వత్ర ఉన్నాననే స్ఫురణ. అది నిరాకారం గనుక సర్వవ్యాపకం. వ్యక్తమయి ఎవరికీ కనిపించేది కాదు గనుక అవ్యక్తం. అదే తన మాయాశక్తికి పని పెట్టి తద్ద్వారా వ్యక్తమయ్యాడంటే వాడు

Page 388

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు