#


Index

విశ్వరూప సందర్శన యోగము

చూస్తే ఆభాస. అలాగే గదా ఇప్పుడు మనం స్వప్నాన్ని చూస్తున్నాం. స్వప్నమంతా కనిపిస్తున్నదంటే ఏమిటి దాని కాధారం. మన స్వరూపమే. అయితే స్వప్నం చూస్తున్నంత సేపూ అది మనకున్నట్టు గుర్తుండదు. మరుగుపడి పోతుంది. దానితో కలిపి పట్టుకోక ఇది నిజమని భ్రమపడుతుంటాం. మెలకువ రాగానే దాన్ని అబద్ధమని తేల్చుకొంటాం. కారణం. అప్పుడు వాస్తవమైన మన స్వరూపం మనకు ప్రకటమవుతుంది. దాని దృష్ట్యా అప్పుడిది ఆభాస అని తేలిపోతుంది. అలాగే ఇక్కడా ఆ ఏకైకమైన తత్త్వాన్ని చూడకుండా వదిలేసి ఈ విశ్వాన్ని చూస్తున్నా ఇది సత్యం కాదు. ఆభాసే. ఇదే ఆ భాస అయితే కొత్తగా చూపే ఆ విశ్వరూపం కూడా ఆభాసే. ఇదీ అదీ రెండూ భగవానుడి సృష్టే గదా. ఒకటి ఆభాస అయి ఒకటి కాకపోతుందా. పైగా స్వరూప జ్ఞానం లేకుండా చూస్తూ కూచుంటే రెండూ మనకు భయోత్పాదకమే. అందుకే ఏకస్థంగా చూడమని సలహా ఇస్తున్నాడాయన.

  అయితే ఎక్కడ ఉందా ఏకం. ఇహ. ఎక్కడో గాదు. ఇక్కడే. ఈ చరాచర జగత్తులోనే అంతటా వ్యాపించి ఉంది. దానిమీదనే కనిపిస్తున్నాయి ఈ పదార్ధాలన్నీ. ఏమిటది అని అడిగితే మన దేహే అని బయటపెడుతున్నాడు. నా శరీరంలోనే అంటాడు. నా శరీరమేమిటి. నా అంటే కృష్ణుడనా. కృష్ణుడి శరీరమనా అర్థం. కృష్ణుడి శరీరంలో కనిపిస్తున్నదా ఈ చరా చర ప్రపంచం. ఆ శరీర మేకమెలా అయింది. ఏకమంటే సజాతీయ

Page 387

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు