#


Index

విశ్వరూప సందర్శన యోగము

కూడా అనంతం. అయితే ఆయన ఏకరూపం. ఇది అనేక రూపం. అనేక రూపంగా విస్తరించిన దంతా మరలా ఆ ఏకమే. ఏకంలోనే ఉందిది మొదట. అప్పుడీ అనేకం లేదు. మధ్యలో ఇది అనేకంగా బయటికి వచ్చి మనకు భాసిస్తున్నది. అది మన అజ్ఞానం వల్ల కావచ్చు. దాని కనుగుణంగా ప్రవర్తించే ఆయన మాయాశక్తి వల్ల కావచ్చు. తరువాత మరలా జ్ఞాన దృష్టితో చూచామంటే ఇది ఆ ఏకంగానే మారి దర్శన మిస్తుంది. అలాంటప్పుడీ అనేక మెక్కడిది. ఎక్కడిదో గాదు. ఏదో గాదు. ఆ ఏకమే. ఏకమే జ్ఞాన దృష్టి కేకంగా అజ్ఞాన దృష్టి కనేకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నదన్న మాట. ఇందులో అనేక మనే రెండవ పాత్ర మొదటిదైన ఏకాన్ని వదిలేసి ఎప్పుడూ ఉండబోదు. ఆ మాటకు వస్తే ఏకమే అనేకంగా భాసిస్తున్నది కాబట్టి ఇది అదే. ఏకంతో చేర్చి పట్టుకొన్నప్పుడే దీని కస్తిత్వం. దానికి దూరమైతే నాస్తే ఇది.

  కనుకనే ఏకస్థం అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. ఏకంలోనే ఉంది ఇదంతా. దాని హద్దులు దాటి ఏదీ లేదు. నీవేది చూస్తున్నా అందులోనే చూస్తున్నావు. ఒక ప్రతి బింబాన్ని చూస్తున్నా వంటే ఎక్కడ చూస్తున్నావది. అద్దంలోనేనా. మరెక్కడైనానా. అద్దం సరిహద్దులు దాటితే ఎక్కడ ఉందా ప్రతిబింబం. అద్దం మీద ఆధారపడేగా ఉంది. అలాగే ఇది. ఈ విశ్వరూప మెంత దూరం విస్తరించి కనిపించినా ఆ ఏకైకమైన స్వరూపంలోనే ఓతప్రోతమయి కనిపిస్తున్నది. దానితో కలిపి చూస్తేనే ఇది సత్యం. వదిలేసి

Page 386

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు