విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
అందులోనే స్థ స్థితమయి ఉందీ విశ్వ ప్రపంచం. అనేకమంటే ఏమిటో వివరిస్తున్నాడు. జగత్కృత్స్నం చరా చరమని. సమస్తమైన చరాచర ప్రపంచమూనట. అండ పిండ బ్రహ్మాండాలూ వాటిలో ఉన్న వన నదీ పర్వతాది జడ పదార్ధాలూ - వాటిలోనే నివసిస్తున్న పిపీలికాది బ్రహ్మ పర్యంతమైన ప్రాణికోటీ - ఎన్ని ఉన్నాయి. ఎంత ఉన్నదీ చరా చర సృష్టి. ఇదంతా కలిసి జగత్తు. జాయతే ఇతి జ గచ్ఛ తీతి గత్. ప్రతి ఒక్కటీ ఇందులో పుడుతున్నదీ గిడుతున్నదే. ప్రతి క్షణమూ మారుతున్నదే. ఇదంతా చూడవచ్చు నీవు. యచ్చాన్య భ్రష్టు మిచ్ఛసి ఇంకా ఏమి చూడదలచుకొన్నావో అదీ చూడవచ్చునంటాడు పరమాత్మ. ఏమున్న దింక చూడటానికి. జగత్కృత్స్న మన్నప్పుడింకేదైనా మిగిలి ఉంటేగా. అలాటిదేదీ లేదని నిర్ధారణ అయినప్పుడీ మాటేమిటి వేళాకోళం గాకపోతే. వేళాకోళమే మరి. పరమాత్మ గాకపోతే ఎవడాడుతాడు వేళాకోళం. ఎందుకు. మన అవివేక మలాంటిది. ఏదీ లేకున్నా ఏదో ఉందని ఊహిస్తూ పోతాము. అదేదో చూడాలని ఉవ్విళ్లూరు తుంటాము. అంతా ఇదే ఇంకేమీ లేదని చెప్పినా మనకు నమ్మకం కలగదు. ఇంకా ఒకటి ఉండకపోతుందా అనే ఆకాంక్ష. అసలీ చూచేది నిజంగా ఉంటే గదా ఇంకేదో ఉందని నీవు ఉబలాటపడటానికీ నేను చూపటానికీ. చూస్తున్నదీ చూపబోయేదీ అంతా వట్టిదేనని ఆయన చేసే వేళకోళమిది.
అంతేకాదు. వేళాకోళంగా పైకి కనిపిస్తున్నా ఇందులో ఒక గంభీరమైన భావం కూడా మనకు స్ఫురిస్తున్నది. పరమాత్మ లాగా ఆయన విభూతి
Page 385