#


Index

విశ్వరూప సందర్శన యోగము భగవద్గీత

గుప్తమైతే ప్రకటమైన రూపమే మయిందప్పుడు. ఎందులో గుప్తమయిందో అదే దాని రూపం. అది పరమాత్మ చైతన్యమే. ఇక ఆ చైతన్యం చూపేదంతా అప్పటికి నాటకమే.

  అలాటి నాటకమే ఇప్పుడు చూపుతూ మాటాడుతున్నాడు. అయితే ఎంత నాటకమైనా అది ఎంత అసత్యమైనా సత్యమనే ఆధారం లేకుండా అది నిలవ లేదు. కనిపించ బోదు. అసత్యానికి సత్యమే ఆధారం. ఎండమావులు కనిపిస్తున్నాయంటే స్వతహాగా అది అసత్యమైనా సత్యమైన సూర్యరశ్మి దాని కాధారం లేకుంటే అది నీకూ నాకూ కనిపించగలదా. రశ్మి అనేది మరుగుపడి దాని స్థానంలో ఇది పైకి వచ్చి గోచరిస్తున్న దంత మాత్రమే. అలాగే ఇప్పుడీ జగన్నాటకానికి కూడా ఏదో ఒక అధిష్ఠాన Basis ముండి తీరాలి. ఏమిటది. దేని బలంతో ఇది మనకెలా దర్శనమిస్తున్న దీ విశ్వరూపమని ప్రశ్న. దీనికి సమాధాన మిస్తున్నా డిప్పుడు కృష్ణ భగవానుడు.

ఇహైకస్థం జగత్కృత్స్నం - పశ్యాద్య స చరాచరం
మమ దేహే గుడాకేశ - యచ్చాన్య భ్రష్టు మిచ్ఛసి -7


  ఇహై కస్థం. అది ఏదో గాదా అధిష్ఠానం. ఇహ ఇక్కడనే ఉంది. అంటే ఈ జగన్నాటకా న్నంతా వ్యాపించి ఉంది. అయితే ఇది అనేకమైతే ఈ విశ్వం అది అనేకం గాదు. ఏకం. ఆ ఏకమే అనేక మంతా లోపలా వెలపలా మధ్యలో దాని ప్రతి అణువూ ఆవరించి ఉన్నది.

Page 384

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు