విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ధైర్యం వారిది. ఒకరిస్తే వచ్చేది గాదది. మనకు లేనిది పుచ్చుకొనేది గాదు. ఏదైనా చూడగలిగిన స్తోమత తనకు సహజంగా ఉంటే చూడాలిగాని అలా తనకే లేకుంటే మరొకడిస్తే మాత్రమెలా చూడగలడు. ఎరువు సొమ్ము మనదవుతుందా. పైగా నాకు ధైర్యముంటుందో లేదో నీవు చెప్పమని అడగటమేమిటి. అమాయికత్వం కాకపోతే.
ఇంకా అమాయికత్వ మేమిటో తెలుసా అర్జునుడికి. ఆత్మానం దర్శయ. ఆత్మను చూపమని కూడా అడుగుతున్నాడు. నీ రూపాన్ని చూపమని ఇంతకు పూర్వమడిగాడు. ఇప్పుడాత్మను చూపమంటాడు. ఇంతకూ భగవత్తత్త్వమా అతడు చూడాలను కొంటున్నది. భగవదైశ్వర్యమా. తత్త్వమే అయితే అది చూచేది కాదు. ఆత్మ నీకు కనపడుతుందా. కండ్లకు కనిపించే దాత్మ అవుతుందా. కనిపిస్తే అది అనాత్మే Object to knowledge అవుతుంది గాని ఆత్మ కాదు. ఆత్మ అంటే అది మన స్వరూపం. అదే అన్నింటినీ కంటుంది గాని ఏదీ దాన్ని కనలేదు. అసంభవం. మన ప్రత్యగాత్మే మనక గోచరమైతే పరమాత్మా గోచరమయ్యేది. అది ఏ జన్మకూ సాధ్యం కాదు. విషయంగా గోచరం కాకున్నా విషయిగా Subjective ఎప్పుడూ మనకను భవ సిద్ధమే. అది ఉన్నదున్నట్టు గుర్తిస్తే చాలు. ఇక అనాత్మ భూతమైన విశ్వాన్ని కొత్తగా చూడనక్కర లేదు. ఇదం సర్వం యదయ మాత్మా అంటున్న దుపనిషత్తు. ఈ విశ్వమంతా ఆత్మగానే దర్శనమిస్తుంది. ఇక కొత్తగా చూచేదేమిటి. అయినా చూడాలను కొంటున్నాడంటే అర్జునుడెంత
Page 381