విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
ఏవమేత ద్యథాతత్వ మాత్మానం పరమేశ్వర
ద్రష్టు మిచ్ఛామి తే రూప - మైశ్వరం పురుషోత్తమ - 3
జరిగిన విషయమే మళ్లీ స్మరిస్తే అది ఉత్తరార్థమంటారు భాష్యకారులు. అంటే అర్థం. తరువాత దాన్ని గూర్చి ఏదో చెప్పబోతాడు. అందుకే అది పరామర్శిస్తాడట. ఇది ఒక శాస్త్ర సంప్రదాయం. బాణీలోనే మాటాడుతున్నా డర్జును డిప్పుడు. ఏమని. ఏవమేవ యధా తత్వం ఆత్మానం. నిన్ను గురించి నీవు నాకు చెప్పినదంతా విన్నాను. అది వాస్తవమే. అందులో ఏ పొరబాటూ లేదు. నీవు చెప్పటంలో లేదు. నేను గ్రహించటంలో లేదు. అంతవరకూ మంచిదే. కాని ఆ చెప్పిన దాని కనురూపంగా ద్రష్టు మిచ్చామి తే రూపమైశ్వరం. జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్యతేజస్సులనే షడ్గుణాలతో కూడిన నీ విభూతి ఎలాటిదో ఎంతటిదో దానినొక సారి నీవు చూపితే కళ్లతో చూడాలని అభిలాషగా ఉందినాకు. చూపుతావా అని కోరుతాడు. విన్నది వేరు కన్నది వేరు. విభూతిని నీవు వర్ణించావు నేను విన్నానే గాని దానినింతవరకూ నీవు చూపలేదు నాకు చూపితే గాని నాకు తృప్తి నివ్వదు. అంతవరకూ కొరతే నా మనస్సుకని అర్జునుడి మనసులో ఉన్న అభిప్రాయం. అందుకే నీ ఆత్మను లేదా స్వరూపాన్ని వర్ణించావే గాని నీ రూపాన్ని చూపలేదని సాభిప్రాయంగా మాటాడుతున్నాడు. స్వరూప మాత్మ అయితే రూప మాత్మ తాలూకు విభూతి.
Page 379