విశ్వరూప సందర్శన యోగము
భగవద్గీత
స్ఫురణ పూర్తిగా అలవడిందంటాడు. అలా అని భారత యుద్ధానంతరం ఇంతకు ముందు చెప్పినదంతా మరచిపోయాను మళ్లీ ఆజ్ఞానం నాకు బోధించమని బ్రతిమాలుతాడు కృష్ణ పరమాత్మను. ప్రగల్భాలు కాక మరి ఏమిటంటా రివి. మనలో కూడా ఇలాటి డంబాలు కొట్టే పండితమ్మన్యు లెంతోమంది ఉన్నారు. అర్జునుడి మీద నెపం పెట్టి మనల నందరినీ మందలిస్తున్నాడు మహర్షి
భవా ప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
త్వత్తః కమల పత్రాక్ష - మాహాత్మ్యమ పిచావ్యయమ్ - 2
ఇంకా తాను భగవానుడి ముఖతః ఎంత విన్నదీ తన కెంత గొప్పగా అర్థమయినదీ తనకు తానే ఏకరువు పెడుతున్నాడాయన ఎదుట. ఏమని. భవాప్యయౌ హిభూతానాం భవా ప్యయాలంటే సామూహికంగా చెబితే సృష్టి ప్రళయాలు. వ్యక్తిగతంగా చెబితే జనన మరణాలు. భూతానాం సకల ప్రాణులకూ ఇవి తప్పవు. ప్రతి ఒక్కటీ జన్మించవలసిందే. జన్మించిన ప్రతి ఒక్కటీ కొంత కాలానికి మరణించ వలసిందే తప్పదు. ఇవి ఎలా జనన మరణాలు అనుభవిస్తున్నాయి జననానికి ముందు మరణానికి అనంతరం వీటి పరిస్థితి ఏమిటో అటు సమష్టి స్థాయిలో గాని ఇటు వ్యష్టి స్థాయిలో గాని మనబోటి అల్పబుద్ధుల కగమ్య గోచరం. అది ఒక అంతు పట్టని రహస్యం. సర్వజ్ఞుడైన ఈశ్వరుడికే అది ఎరుక. ఆయనగారు కరుణయా బయటపెడితేనే తెలుస్తుందెవరికైనా. అది శ్రుతౌ
Page 377